దేవుడే ఇల చేరేటందుకు

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics


దేవుడే ఇల చేరేటందుకు ఎన్నుకున్న మార్గం
అమ్మా అంటూ పిలుచుకొని పొందుకొనెను జన్మం
నీకంటూ ఏది లేదన్నట్లు ఎందుకంత త్యాగం
కనరాని ప్రేమకు నీవేగా కదలాడుతున్న రూపం (2)
అమ్మా నీ ఋణమును తీర్చే సిరులు లేవు ఇలలో
ఆ దైవము సైతము నేర్చె పాఠాలు చల్లని నీ ఒడిలో (2)         ||దేవుడే||

కన్న బిడ్డను పరాయి బిడ్డగా పెంచుకున్న మమకారం
తన ప్రజల విముక్తికి దేవుడు చేసిన కార్యంలో సహకారం (2)
మోషేగా మారిన పసివాడిని
దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం (2)
దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం       ||అమ్మా||

సంతతి లేక సవతి పోరుతో విసిగినట్టి దీనత్వం
దేవుని సన్నిధి హృదయము పరచి పొందుకొనెను మాతృత్వం (2)
హన్నా చేసిన ఆ త్యాగమే కాదా
సమూయేలు పొందిన న్యాయాధిపత్యము (2)
సమూయేలు పొందిన న్యాయాధిపత్యము      ||అమ్మా||

కొన ఊపిరితో సిలువపైన వేళాడుతున్న క్షణము
ఆ దేవ దేవుడు తీర్చుకొనెను తన మాతృమూర్తి ఋణము (2)
ప్రియ శిష్యుని దరికి తల్లిని చేర్చి
నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం (2)
నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం      ||అమ్మా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

దేవుడే నాకాశ్రయంబు

పాట రచయిత: పంతగాని పరదేశి
Lyricist: Panthagani Paradeshi

Telugu Lyrics


దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము
మహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచును
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ          ||దేవుడే||

పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడినను
సర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్       ||అభయ||

దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లును
ఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు      ||అభయ||

రాజ్యముల్ కంపించిన భూ – రాష్ట్రముల్ ఘోషించిన
పూజ్యుండౌ యెహోవా వైరి – బూని సంహరించును       ||అభయ||

విల్లు విరచు నాయన తెగ – బల్లెము నరకు నాయన
చెల్ల చెదర జేసి రిపుల – నెల్లద్రుంచు నాయనే           ||అభయ||

పిశాచి పూర్ణ బలము నాతో – బెనుగులాడ జడియును
నశించి శత్రు గణము దేవు – నాజ్ఞ వలన మడియును      ||అభయ||

కోటయు నాశ్రయమునై యా – కోబు దేవు డుండగా
ఏటి కింక వెరవ వలయు – నెప్డు నాకు బండుగ         ||అభయ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME