శ్రేష్టమైన నామం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


శ్రేష్టమైన నామం – శక్తి గలిగిన నామం
జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం
సాటిలేని నామం – స్వస్థపరచే నామం
అన్ని నామముల కన్నా నిత్యమైన నామం
యేసు నామం మధుర నామం
యేసు నామం సుమధుర నామం (2)          ||శ్రేష్టమైన||

త్రోవ చూపి సరియైన దారిలో నన్ను నడిపించే నామం
దుష్ట శక్తులు బంధకములు తొలగించే
తరములెన్నో మారినా మనుజులంతా మారినా (2)
మారని నామం మహిమ నామం
మరణము గెల్చిన శ్రీ యేసు నామం (2)          ||శ్రేష్టమైన||

జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం
కలవరము నను వెంటాడినను ధైర్యమునిచ్చె ప్రభు నామం
భారమెంతో ఉన్నను శాంతినొసగే దివ్య నామం (2)
మారని నామం మహిమ నామం
మరణము గెల్చిన శ్రీ యేసు నామం (2)           ||శ్రేష్టమైన||

English Lyrics

Audio

 

 

జుంటె తేనె ధారల కన్నా

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


జుంటె తేనె ధారల కన్నా
యేసు నామమే మధురం
యేసయ్య సన్నిధినే మరువజాలను (2)
జీవితకాలమంతా ఆనందించెదా
యేసయ్యనే ఆరాధించెదా (2)          ||జుంటె తేనె||

యేసయ్య నామమే బహు పూజనీయము
నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి (2)
నన్నెంతగానో దీవించి
జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే (2)      ||జుంటె తేనె||

యేసయ్య నామమే బలమైన దుర్గము
నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి (2)
నన్నెంతగానో కరుణించి
పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే (2)         ||జుంటె తేనె||

యేసయ్య నామమే పరిమళ తైలము
నాలో నివసించే సువాసనగా నను మార్చి (2)
నన్నెంతగానో ప్రేమించి
విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే (2)         ||జుంటె తేనె||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME