జీవితాంతము వరకు నీకే

పాట రచయిత: పి డి శుభామణి
Lyricist: P D Shubhaamani

Telugu Lyrics

జీవితాంతము వరకు నీకే – సేవ సల్పుదునంటిని
నీవు నాతో నుండి ధైర్యము – నిచ్చి నడుపుము రక్షకా   ||జీవితాంతము||

ఎన్ని యాటంకంబులున్నను – ఎన్ని భయములు కల్గిన
అన్ని పోవును నీవు నాకడ – నున్న నిజమిది రక్షకా   ||జీవితాంతము||

అన్ని వేళల నీవు చెంతనె – యున్న యను భవమీయవె
తిన్నగా నీ మార్గమందున – పూనినడచెద రక్షకా   ||జీవితాంతము||

నేత్రములు మిరుమిట్లు గొలిపెడి – చిత్రదృశ్యములున్నను
శత్రువగు సాతాను గెల్వను – చాలు నీ కృప రక్షకా   ||జీవితాంతము||

నాదు హృదయమునందు వెలుపట – నావరించిన శత్రులన్
చెదర గొట్టుము రూపుమాపుము – శ్రీఘ్రముగ నారక్షకా   ||జీవితాంతము||

మహిమలో నీవుండు చోటికి – మమ్ము జేర్చెదనంటివే
ఇహము దాటినదాక నిన్ను – వీడనంటిని రక్షకా   ||జీవితాంతము||

పాప మార్గము దరికి బోవక – పాత యాశల గోరక
ఎపుడు నిన్నే వెంబడింపగ – కృప నొసంగుము రక్షకా   ||జీవితాంతము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

నీ దీర్ఘశాంతమే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము
నీ కరుణా కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము (2)
యేసయ్యా… కనిపించరే
నీలాగా ప్రేమించే వారెవరు (2)    ||నీ దీర్ఘ||
కడుపేద స్థితిలోనే కరువే నా బంధువాయెను
వయసొచ్చిన తరుణములో వస్త్ర హీనతే కృంగదీసెను (2)
(ఏ) ఆధారము కనిపించని నా బ్రతుకులో
ఐశ్వర్యవంతుడ నన్నాదుకున్నావు (2)
యేసయ్యా… కనిపించరే
నీలాగా దీవించే వారెవరు (2)    ||నీ దీర్ఘ||
ఈ లోక జ్ఞానులలో వెర్రివానిగా ఉంటిని
ఎన్నికైన వారిలో వ్యర్థునిగా మిగిలి ఉంటిని (2)
తృణీకరింపబడిన నా బ్రతుకును
కరుణా సంపన్నుడా నన్నెన్నుకున్నావు (2)
యేసయ్యా… కనిపించరే
నీలాగా కృప చూపే వారెవరు (2)    ||నీ దీర్ఘ||
నా ప్రాణము నాలో కృంగివున్న సమయములో
జీవము గల నీకై నా ప్రాణము పరితపించెను (2)
మధురమైన నీ సహవాసముతో
నా జీవ నాథుడా నీ మమతను పంచావు (2)
యేసయ్యా… కనిపించరే
నీలాంటి జీవము గల దేవుడెవ్వరు(2)    ||నీ దీర్ఘ||

English Lyrics

Audio

క్రైస్తవుడా సైనికుడా

పాట రచయిత: కే రాజబాబు
Lyricist: K Rajababu

Telugu Lyrics


క్రైస్తవుడా సైనికుడా
బలవంతుడా పరిశుద్ధుడా
కదలిరావోయ్ నీవు కదలిరా (4)

జాలరీ మనుషులు పట్టు జాలరి
ఆత్మలు పట్టు కాపరి
అమృతమందించే ఆచారి
యేసుకై జీవించే పూజారి        ||క్రైస్తవుడా||

సిలువే నీ స్థావరము
శ్రమలే నీ సైన్యము (2)
సహనమే నీ ధైర్యము
వాక్యమే నీ విజయము (2)        ||క్రైస్తవుడా||

సత్యమే నీ గమ్యము
సమర్పణే నీ శీలము (2)
యేసే నీ కార్యక్రమం
ప్రేమే నీ పరాక్రమం (2)        ||క్రైస్తవుడా||

దేశంలో విదేశంలో
గ్రామంలో కుగ్రామంలో (2)
అడవులలో కొండలలో
పని ఎంతో ఫలమెంతో (2)        ||క్రైస్తవుడా||

సిద్ధాంతపు గట్టు దుమికి రా
వాగులనే మెట్టును దిగిరా (2)
దీనుడా ధన్యుడా
విజేయుడా అజేయుడా (2)        ||క్రైస్తవుడా||

వాగ్ధాన భూమి స్వతంత్రించుకో
అద్వానపు అడవి దాటి ముందుకుపో (2)
నీ ఇల్లు పెనూయేలు
నీ పేరే ఇశ్రాయేలు (2)        ||క్రైస్తవుడా||

English Lyrics

Audio

నిబ్బరం కలిగి

పాట రచయిత: అనిల్ కుమార్
Lyricist: Anil Kumar

Telugu Lyrics

నిబ్బరం కలిగి ధైర్యముగుండు
దిగులు పడకు జడియకు ఎప్పుడు (2)
నిన్ను విడువడు నిన్ను మరువడు
ప్రభువే నీ తోడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా
ఊరక నిలిచి ప్రభువు చూపే – రక్షణ చూద్దాము
నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ – కనబడరన్నాడు
హల్లెలూయా ఆమెన్ – హల్లెలూయా       ||నిబ్బరం||

పర్వతాలు తొలగినా – మెట్టలు తత్తరిల్లినా (2)
ప్రభు కృప మమ్మును విడువడుగా (2)
ఎక్కలేని ఎత్తైన కొండను
ఎక్కించును మా ప్రభు కృప మమ్మును
ప్రభువే మా బలము         ||హల్లెలూయా||

మునుపటి కంటెను – అధికపు మేలును (2)
మా ప్రభు మాకు కలిగించును (2)
రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును
శత్రువు ఎదుటనే భోజనమిచ్చును
ప్రభువే మా ధ్వజము       ||హల్లెలూయా||

మా అంగలార్పును – నాట్యముగా మార్చెను
బూడిద బదులు సంతోషమిచ్చెను (2)
దుఃఖ దినములు సమాప్తమాయెను
ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను
ప్రభునకే స్తోత్రం      ||హల్లెలూయా||

స్త్రీ తన బిడ్డను – మరచినా మరచును (2)
మా ప్రభు మమ్మును మరువడుగా (2)
చూడుము నా అరచేతిలనే
చెక్కితి నిను అన్నాడు ప్రభువు
ప్రభువే చూచుకొనును      ||హల్లెలూయా||

రాబోవు కాలమున – సమాధాన సంగతులే (2)
మా ప్రభు మాకై ఉద్దేశించెను (2)
ఇదిగో నేనొక నూతన క్రియను
చేయుచున్నానని మా ప్రభువు చెప్పెను
ఇప్పుడే అది మొలుచున్      ||హల్లెలూయా||

మేము కట్టని ఫురములను – మేం నాతని తోటలను (2)
మా ప్రభు మాకు అందించును (2)
ప్రాకారముగల పట్టణములోనికి
ప్రభువే మమ్మును నడిపింపచేయును
ప్రభువే మా పురము         ||హల్లెలూయా||

English Lyrics

Audio

HOME