నా ప్రాణమా దిగులెందుకు

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

Telugu Lyrics


నా ప్రాణమా దిగులెందుకు – నీ రక్షకుని స్మరియించుకో
మహిమోన్నతుడు బలవంతుడు – నీ పక్షమునే నిలిచెను చూడు
లేవరా వీరుడా – నిరాశను వీడరా
నీ రాజు నిన్ను పిలిచెను – కదులు ముందుకు కదులు ముందుకు
అసాధ్యుడే నీకుండగా – అసాధ్యము నీకుండునా
భయము వీడి నడవరా – జయము నీదే జయము నీదే ౹౹నా ప్రాణమా||

యేసులో విశ్వాసమే నీ చేతిలోని ఆయుధం
విడువకుండ పట్టుకో ఎన్ని శ్రమలు నీకు కలిగినా
లేమిలో కొలిమిలో ఒంటరివి కావు ఎన్నడూ
యేసు నీతో ఉండును నీ సహాయమాయనే
నీవు వెంబడించువాడు నీవు నమ్మదగిన దేవుడు
నీ శ్రమలు దూరపరచును నిన్ను గొప్పగా హెచ్చించును (2) ||నా ప్రాణమా||

గర్జించు సింహమువలె సాతాను వెంటపడినను
ఎదురు తిరిగి నిలబడు వాడు నిలువలేకపోవును
జయించెనేసు ఎన్నడో సాతాను ఓడిపోయెను
నీ ఎదుటనున్న శత్రువు ప్రభావము శూన్యమే
నీలోన ఉన్నవాడు లోకములనేలువాడు
నిర్భయముగా సాగిపో నిన్ను ఆపలేరు ఎవ్వరు (2) ||నా ప్రాణమా||

నీవు ఎక్కలేని కొండను ఎక్కించును నీ దేవుడు
నీవు చేరలేని ఎత్తుకు నిన్ను మోయునాయనే
నీ ప్రయాస కాదు వ్యర్థము యేసు గొప్ప ఫలము దాచెను
తన తండ్రి ఇంట నీకును సిద్ధపరచెను నివాసము
ఊహించలేని మహిమతో ప్రభువు నిన్ను నింపివేయును
ఆశ్చర్యమైన స్వాస్థ్యము నీ చేతికప్పగించును (2) ౹౹నా ప్రాణమా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

చింతెందుకు

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


చింతెందుకు మీకు దిగులెందుకు
మన ప్రియులు లేరని బాధెందుకు (2)
కష్టాలు లేని కన్నీళ్లు లేని
పరదైసులోన తానుండగా (2)        ||చింతెందుకు||

శాశ్వతము కాదు ఈ లోకము
మన గమ్యస్థానము పరలోకము (2)
ఎన్నాళ్ళు బ్రతికినా మన ప్రభువు పిలుపుకు
తప్పక ఈ భువిని వీడాలిగా (2)       ||చింతెందుకు||

ఒకరోజు మన ప్రియుని చూస్తామనే
నిరీక్షణ ప్రభువు మనకొసగెగా (2)
ఆ రోజు వరకు పరదైసులోన
అబ్రహాము చెంతన తానుండగా (2)      ||చింతెందుకు||

English Lyrics

Audio

HOME