ఎట్టి వాడో యేసు

పాట రచయిత: గోడి సామ్యూల్
Lyricist: Godi Samuel

Telugu Lyrics

ఎట్టి వాడో యేసు – ఎన్ని వింతలు తనవి
వట్టి నరుడు కాడు – పట్టి చూడ ప్రభుని – (2)      ||ఎట్టి||

గాలి సంద్రాలను – గద్ధింపగా యేసు (2)
హద్దు మీరక ఆగి – సద్దుమణిగిపోయే (2)      ||ఎట్టి||

పక్షవాతపు రోగిని – తక్షణమే లెమ్మనగా (2)
పరుపెత్తుకొని లేచి – పరుగెత్తికొనిపోయె (2)      ||ఎట్టి||

పట్టు యేసుని పాదం – తట్టు దేవుని ద్వారం (2)
కట్టు ఇక నీ పాపం – నెట్టు నిను పరలోకం (2)      ||ఎట్టి||

English Lyrics

Audio

కట్టెలపై నీ శరీరం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ
మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి
ఎన్ని చేసినా తనువు నమ్మినా
కట్టె మిగిల్చింది కన్నీటి గాధ – (2)        ||కట్టెలపై||

దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను
తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2)
కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా
నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా (2)         ||ఎన్ని చేసినా||

ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు
అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు (2)
కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూ
ఎవ్వరికీ కనిపించక నీ ఆత్మ వెళ్లిపోవును (2)         ||ఎన్ని చేసినా||

English Lyrics

Audio

ఎన్ని తలచినా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా

నీ తోడు లేక నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)
అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా      ||ఎన్ని||

నా ఇంటి దీపం నీవే అని తెలసి
నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)
ఆరిపోయిన నా వెలుగు దీపము (2)
వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా      ||ఎన్ని||

ఆపదలు నన్ను వెన్నంటియున్నా
నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)
లోకమంతయూ నన్ను విడచినా (2)
నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా      ||ఎన్ని||

నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి
నా కొరకై కల్వరిలో యాగమైతివి (2)
నీదు యాగమే నా మోక్ష మార్గము (2)
నీయందే నిత్యజీవము (2) ప్రభువా         ||ఎన్ని||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME