ఓ మానవా

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics

ఓ మానవా.. నిజమేదో ఎరుగవా
ఓ మానవా.. ఇకనైనా మారవా
మన పాపములను క్షమియించుటకే
సిలువ మరణము పొందెనని (2)
గ్రహియించి నేడు – ఆ యేసు ప్రభుని వేడు (2)
ఈ దినమే అనుకూలం…
లేదిక వేరే ఏ సమయం (2)
నిజమేదో తెలియకనే
చనిపోతే నీ గతి ఏమి? (2)     ||ఓ మానవా||

సిలువను గూర్చిన శుభ వార్త
వెర్రితనముగా ఉన్నదా?
దేవుని శక్తని తెలుసుకొని
ప్రభు మార్గమును చేరెదవా (2)           ||ఈ దినమే||

ప్రయాసముతో భారము మోసే
నిన్నే దేవుడు పిలిచెనుగా
ప్రయత్నము వీడి విశ్రాంతిని పొంద
వేగిరమే పరుగిడి రావా (2)          ||ఈ దినమే||

నీ ధనము నీ ఘనము
నీ సర్వస్వము చితి వరకే
అర్పించుము నీ హృదయమును
(నిజ) రక్షకుడైన ప్రభు కొరకే (2)           ||ఈ దినమే||

English Lyrics

Audio

ఇహమందున

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics

ఇహమందున ఆ పరమందు నాకు
గృహమొసగిన నా దైవమా
మితిలేని ప్రేమతో గతిలేని నాకు
స్థితినొసగిన నా స్నేహమా (2)
యేసయ్యా నీవే నా ఆద్యంతం
యేసయ్యా నీలోనే నా ఆత్మీయం
యేసయ్యా నీకై నా ఆరాటం
యేసయ్యా నీతోనే నా ఆనందం
నీవే నా ఆశీర్వాదం
నీతోనే నా అనుబంధం (2)      ||ఇహమందున||

నేనునూ నా ఇంటి వారును
యెహోవాను సేవించెదం (2)
అని యెహోషువా నిను కొనియాడినంతగా
కీర్తించనా నిను స్తుతియించనా
నీ మేలులను నే చాటించనా (2)
యేసయ్యా నీవే నా సమీపం
యేసయ్యా నీలోనే నే సంపూర్ణం
యేసయ్యా నీకై నా సామర్ధ్యం
యేసయ్యా నీతోనే నా సంతోషం
నీవే నా సర్వస్వం
నీతోనే నా సహవాసం (2)        ||ఇహమందున||

నీ ఇంటి లోనికి నను చేర్చడానికి
ఈ భువికేగి సిలువలో బలి అయితివా (2)
మరిలేచి మహిమతో ఏతెంచితివే
మధ్యాకాశమున నిను వీక్షించుటే
నీ కొరకు నాకున్న నిరీక్షణ (2)
యేసయ్యా నీవే నా ప్రస్థానం
యేసయ్యా నీలోనే నే ప్రత్యేకం
యేసయ్యా నీకై నా ప్రావీణ్యం
యేసయ్యా నీతోనే నా ప్రయాణం
నీవే నా ప్రపంచం
నీతోనే నా ప్రతి నిమిషం (2)        ||ఇహమందున||

English Lyrics

Audio

HOME