స్తుతి పాడి కీర్తింతుము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


స్తుతి పాడి కీర్తింతుము – ఘనుడైన మన దేవుని
మనసార మన దేవుని – ఘనపరచి పూజింతుము (2)
ఆశ్చర్య కరుడాయెనే – ఆలోచన కర్తాయనే (2)
ఆది అంతము లేనివాడు (2)
మార్పు చెందని – మహనీయుడు (2)        ||స్తుతి పాడి||

జీవ…హారము ఆయనే – జీవ జలము ఆయనే (2)
ఆకలి గొనిన వారిని – పోషించే – దయమాయుడు (2)        ||స్తుతి పాడి||

గుండె చెదరిన వారిని – గాయపడిన వారినెల్ల (2)
తన బాహుబలము చేత (2) – బాగుచేయు బలవంతుడు (2)        ||స్తుతి పాడి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

వివాహమన్నది

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


వివాహమన్నది పవిత్రమైనది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది (2)

ఎముకలలో ఒక ఎముకగా – దేహములో సగ భాగముగా (2)
నారిగా సహకారిగా- స్త్రీని నిర్మించినాడు దేవుడు (2)          ||వివాహమన్నది||

ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని (2)
శిరస్సుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు (2)          ||వివాహమన్నది||

దేవునికి అతిప్రియులుగా – ఫలములతో వృద్ధి పొందగా (2)
వేరుగా నున్న వారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు (2)          ||వివాహమన్నది||

English Lyrics

Audio

HOME