ప్రభుని గృహము

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ప్రభుని గృహము ఆయన మహిమతో
పరిపూర్ణముగా నిండెను (2)

అపరాధములచే ప్రజలందరును
దేవుని మహిమను కోల్పోయిరి (2)
తన మహిమను మన కిచ్చుటకు (2)
యేసు ప్రభువే బలి యాయెన్ (2)        ||ప్రభుని||

కృపా సత్యములు సంపూర్ణముగా
మన మధ్యలో వసించెను (2)
తండ్రి మహిమను తన సుతునిలో (2)
మనమందరము చూచితిమి (2)        ||ప్రభుని||

ప్రభువు యింటిని నిర్మించు చుండె
సజీవమైన రాళ్ళతో (2)
ఆయన మహిమ దానియందుండ (2)
తన సంకల్పమై యున్నది (2)        ||ప్రభుని||

శాంతిరాజు యిల్లు కట్టుచున్నాడు
మానవ హస్తము అందుండదు (2)
క్రయమునిచ్చి స్థలముకొనెను (2)
తాను కోరిన స్థలమదే (2)        ||ప్రభుని||

ప్రత్యేకపరచిన ఆత్మీయ యింటికి
తన పునాదిని వేసెను (2)
రక్షణ జీవిత సాక్ష్యము ద్వారా (2)
ప్రభువే సర్వము చేసెను (2)        ||ప్రభుని||

సింహాసనముపై కూర్చున్న ప్రభువే
అణగ ద్రొక్కెను శత్రువును (2)
సంపూర్ణ జయముతో ఆర్భాటముతో (2)
వెలిగించెను తన యింటిని (2)        ||ప్రభుని||

దేవుని యిల్లు ముగించబడగా
పైనుండి అగ్ని దిగివచ్చున్ (2)
దహించబడును సర్వ మలినము (2)
ఇంటిని మహిమతో నింపును (2)        ||ప్రభుని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

రాజుల రాజుల రాజు

పాట రచయిత:
Lyricist: 

Telugu Lyrics


రాజుల రాజుల రాజు
సీయోను రారాజు (2)
సీయోను రారాజు నా యేసు
పైనున్న యెరూషలేము నా గృహము (2)

తల్లి గర్భము నుండి వేరు చేసి
తండ్రి ఇంటి నుండి నన్ను పిలచి (2)
సీయోను కొరకే నన్ను ఏర్పరచిన
సీయోను రారాజు నా యేసు (2)       ||రాజుల||

నిషేధించబడిన రాయి
సీయోనులో మూల రాయి (2)
ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన
సీయోను రారాజు నా యేసు (2)       ||రాజుల||

English Lyrics

Audio

HOME