నా చిన్ని దోనెలో

పాట రచయిత: పి వి వి సురేష్ కుమార్
Lyricist: P V V Suresh Kumar

Telugu Lyrics


హైలెస్సా హైలో హైలెస్సా (2)
నా చిన్ని దోనెలో యేసు ఉన్నాడు
భయమేమి లేదు నాకు ఎప్పుడు (2)       ||హైలెస్సా||

పెను గాలులే ఎదురొచ్చినా
తుఫానులే నన్ను ముంచినా (2)
జడియక బెదరక నేను సాగెద
అలయక సొలయక గమ్యం చేరెద (2)       ||హైలెస్సా||

English Lyrics

Audio

హల్లెలూయా నా పాట

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

హైలెస్సా హైలో హైలెస్సా (2)
హైలెస్సా హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హల్లెలూయా నా పాట
హల్లెలూయా మా పాట
హల్లెలూయా మన పాట
హైలెస్సా హైలో హైలో హైలెస్సా

అలలపైన నా పడవ
అంచలుగా సాగింది
హైలెస్సా హైలెస్సా హైలెస్సా (4)
అలలపైన నా పడవ
అంచలుగా సాగింది
శిలలు కరిగి నదులై
నా జీవ నావ కదిలింది (2)     ||హైలెస్సా||

పెనుతుఫాను గాలులలో
మునిగిపోక నిలిచింది
హైలెస్సా హైలో హైలెస్సా (4)
పెనుతుఫాను గాలులలో
మునిగిపోక నిలిచింది
మునిమాపుకు నా పడవ
మోక్షనగరు చేరింది (2)     ||హైలెస్సా||

English Lyrics

Audio

ఆ దరి చేరే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ఆ దరి చేరే దారే కనరాదు
సందె వెలుగు కనుమరుగై పోయే
నా జీవితాన చీకటులై మ్రోగే (2)
ఆ దరి చేరే
హైలెస్సో హైలో హైలెస్సా (2)

విద్య లేని పామరులను పిలిచాడు
దివ్యమైన బోధలెన్నో చేసాడు (2)
మానవులను పట్టే జాలరులుగా చేసి
ఈ భువిలో మీరే నాకు సాక్షులన్నాడు (2)      ||ఆ దరి||

సుడి గాలులేమో వీచెను
అలలేమో పైపైకి లేచెను (2)
ఆశలన్ని అడుగంటిపోయెను
నా జీవితమే బేజారైపోయెను (2)      ||ఆ దరి||

వస్తానన్నాడు ఎప్పుడూ మాట తప్పడు
ఎంత గండమైనా అండ ప్రభువు ఉన్నాడు (2)
దరి చేర్చే నాథుడు నీ చెంతనుండగా
ఎందుకు నీ హృదయాన ఇంత తొందర (2)      ||ఆ దరి||

 

English Lyrics

Audio

HOME