ప్రభువా నీ పరిపూర్ణత నుండి

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ప్రభువా నీ పరిపూర్ణత నుండి
పొందితిమి కృప వెంబడి కృపను

ప్రభువైన యేసు క్రీస్తు – పరలోక విషయములో
ప్రతి ఆశీర్వాదమును – ప్రసాదించితివి మాకు       ||ప్రభువా||

జనకా నీ-వెన్నుకొనిన – జనుల క్షేమము జూచి
సంతోషించునట్లు – నను జ్ఞాపకముంచుకొనుము        ||ప్రభువా||

నీదు స్వాస్థ్యమైనట్టి – నీ ప్రజలతో కలిసి
కొనియాడునట్లుగా – నను జ్ఞాపకముంచుకొనుము        ||ప్రభువా||

దేవా నీదు స్వరూప – దివ్య దర్శనమును
దినదినము నాకొసగి – నను జ్ఞాపకముంచుకొనుము        ||ప్రభువా||

మీ మధ్యన నా ఆత్మ – ఉన్నది భయపడకు
డనిన మహోన్నతుడా – నను జ్ఞాపకముంచుకొనుము        ||ప్రభువా||

ముదమారా నన్నెన్నుకొని – ముద్ర యుంగరముగను
చేతుననిన ప్రభువా – నను జ్ఞాపకముంచుకొనుము        ||ప్రభువా||

కృపా సత్య సమ్మిళిత – సంపూర్ణ స్వరూప
హల్లెలూయా నీకే ప్రభో – ఎల్లప్పుడూ కలుగుగాక        ||ప్రభువా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఓ నాదు యేసు రాజా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ఓ నాదు యేసు రాజా
నిన్ను నే నుతించెదను (2)
నీ నామమును సదా
నే సన్నుతించుచుండును (2) ||ఓ నాదు||

అనుదినము నిను స్తుతియించెదను (2)
ఘనంబు చేయుచుండును నేను (2) ||ఓ నాదు||

వర్ణించెద నే నీ క్రియలను (2)
స్మరియించెద నీ మంచితనంబున్ (2) ||ఓ నాదు||

రక్షణ గీతము నే పాడెదను (2)
నిశ్చయ జయధ్వని నే చేసెదను (2) ||ఓ నాదు||

విజయ గీతము వినిపించెదను (2)
భజియించెద జీవితమంతయును (2) ||ఓ నాదు||

నిరీక్షణ పూర్ణత కలిగి (2)
పరికించెద నా ప్రభు రాకడను (2) ||ఓ నాదు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME