ఈ దినం క్రీస్తు జన్మ దినం

పాట రచయిత: కృపాదాస్ కొల్లాటి
Lyricist: Krupadas Kollati

Telugu Lyrics

ఈ దినం క్రీస్తు జన్మ దినం
శుభకరం లోక కళ్యాణం
పరమును విడచి ఇలకు చేరిన
మహిమ అవతారం (2)
ఆడుము పాడుము ప్రభుని నామము
నూతన గీతముతో
రక్షణ పొందుము ఈ సమయము
నూతన హృదయముతో (2)        ||ఈ దినం||

దేవ దూతలు పలికిన ప్రవచనం
జ్ఞానులకొసగిన దివ్య మార్గం (2)
ధన్యత కలిగిన దావీదు పురము
కన్య మరియకు ప్రసవ తరుణం        ||ఆడుము||

పాప దుఃఖములన్నియు పారద్రోలును
కృపయు క్షేమము కలుగజేయును (2)
రక్షణ నొసగెడి పరమ సుతునికి
ఇమ్మానుయేలని నామకరణము         ||ఈ దినం||

English Lyrics

Audio

ఇది శుభోదయం

పాట రచయిత: పండు ప్రేమ్ కుమార్
Lyricist: Pandu Prem Kumar

Telugu Lyrics

ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం
ఇది లోక కళ్యాణం
మేరి పుణ్యదినం – (2)

రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో
భయము లేదు మనకిలలో
జయము జయము జయమహో       ||ఇది||

గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో
పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో
జయనాదమే ఈ భువిలో
ప్రతిధ్వనించెను ఆ దివిలో       ||ఇది||

English Lyrics

Audio

క్రిస్మస్ పండుగ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

క్రిస్మస్ పండుగ వచ్చేనులే నేడు
యేసయ్య జన్మదినం వచ్చేనులే (2)
ఆనందించెదం నూతన కీర్తన పాడెదం
యేసయ్య ప్రేమను లోకమంతా చాటేడం తెడం
యేసయ్య మార్గములో ఆనందముగా సాగెదం (2)

కన్యక గర్భములో యేసయ్య జన్మించెను
పశువుల పాకలోనే పరిశుద్ధుడు జన్మించెను
దివినుండి దూతలొచ్చి కొత్త పాటలు పాడెను (2)
గొల్లలు వచ్చిరి యేసయ్యను చూచిరి
రక్షకుడు పుట్టెనని లోకమంతా చాటిరి (2)     ||క్రిస్మస్||

దేవుని బహుమానముగా శ్రేష్టుడు భువికొచ్చెను
తన ప్రేమను వెల్లడి చేయ తన ప్రాణం అర్పించెను
సాతాను కట్లన్ని యేసయ్య తెంచెను (2)
జ్ఞానులు వచ్చిరి యేసయ్యను చూచిరి
బహుమానములిచ్చిరి సాగిలపడి మొక్కిరి (2)     ||క్రిస్మస్||

English Lyrics

Audio

HOME