గూడు విడచి వెళ్లిన నాడే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

గూడు విడచి వెళ్లిన నాడే
చేరెదనా ఇంటికి
పాడెదన్ జయగీతమే
నాకై శ్రమలు పొందిన యేసుకై

నిందలు పోవును బాధలు తీరును
ప్రాణప్రియతో ఎత్తబడగా
పావురము వలెనే ఎగురుచు
రూపాంతరము పొందెదనే

బంధువు మిత్రులంతా నన్ను విడచినను
ఏకమై కూడి రేగినను
చేయి పట్టిన నాధుడే నన్ను
తన చెంత చేర్చుకొనును

లోకము నాకు వద్దు లోకపు ఆశలు వద్దు
నడిచెద యేసుని అడుగులో
నాకున్న సమస్తమును నీకై
అర్పించెదను యేసువా

English Lyrics

Audio

స్తుతి గానమే పాడనా

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


స్తుతి గానమే పాడనా
జయగీతమే పాడనా (2)
నా ఆధారమైయున్న
యేసయ్యా నీకు – కృతజ్ఞుడనై
జీవితమంతయు సాక్షినై యుందును (2)       ||స్తుతి||

నమ్మదగినవి నీ న్యాయ విధులు
మేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి (2)
నీ ధర్మాసనము – నా హృదయములో
స్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే (2)       ||స్తుతి||

శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు
లౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి (2)
నీ శ్రేష్టమైన – పరిచర్యలకై
కృపావరములతో నను – అలంకరించితివే (2)       ||స్తుతి||

నూతనమైనది నీ జీవ మార్గము
విశాల మార్గము కంటే – ఎంతో ఆశించదగినది (2)
నీ సింహాసనము – నను చేర్చుటకై
నాతో నీవుంటివే – నా గురి నీవైతివే (2)       ||స్తుతి||

English Lyrics

Audio

HOME