పాట రచయిత:
Lyricist:
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
విధేయత కలిగి జీవించుటకు
జీవమిచ్చాడు యేసు జీవమిచ్చాడు
ప్రతి ఉదయము యేసయ్యతో మాటలాడుటకు
ప్రార్ధన నేర్పాడు యేసు ప్రార్ధన నేర్పాడు
యేసయ్యతో ఉంటే సంతోషమే
యేసయ్యతో ఉంటే ఆనందమే
సాతానుతో ఉంటే కష్టాలు
సాతానుతో ఉంటే నష్టాలూ
అందుకని
ప్రతి రోజు మనం, దేవుణ్ణి ప్రార్ధించి
దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండి
మన సొంత ఇల్లైన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధమయ్యి
మన అమ్మ నాన్నలను కూడా పరలోక రాజ్యానికి తీసుకు వెళదామా
సరే ఇప్పుడు ఏం చేయాలంటే
ప్రతి ఆదివారము మందిరమునకు వెళ్లి
యేసయ్యను ఆరాధించెదము
ఏం చెయ్యాలంటే
ప్రతి ఆదివారము మందిరమునకు వెళ్లి
యేసయ్యను ఆరాధించెదము
బుడి బుడి బుడి అడుగులతో
చిట్టి చిట్టి చిట్టి చేతులెత్తి (2)
యేసయ్యను ఆరాధించెదము
యేసయ్యా ఈ రోజు నుండి
నీ వాక్యమనే మార్గములో నడిపించు యేసయ్యా