రావయ్య యేసునాథా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము
నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు

హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమి
మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను         ||రావయ్య||

నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి
మా గండంబులన్నియు ఖండించుటకు        ||రావయ్య||

మేర లేని పాపము మాకు భారమైన మోపు
నీవు దూరంబుగా జేసి దారి జూపుటకు       ||రావయ్య||

పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను
మా పాపంబులన్నియు పారద్రోలుటకు          ||రావయ్య||

అందమైన నీదు పరమానంద పురమందు
మేమందరము జేరి యానందించుటకు         ||రావయ్య||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME