ప్రేమిస్తా నిన్నే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా
పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా (2)
చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా
యేసయ్యా నీ సన్నిధి చాలయా (2)        ||ప్రేమిస్తా||

నను ప్రేమించి భువికొచ్చినది నీ ప్రేమ
సిలువలో మరణించి బలియైన ఆ ప్రేమ (2)
ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు
నా జీవమర్పింతు నీ సేవకు (2)          ||చాలయ్యా||

కన్నీటిని తుడిచి ఓదార్చును నీ ప్రేమ
కరములు చాపి కౌగిట చేర్చును ఆ ప్రేమ (2)
ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు
నా జీవమర్పింతు నీ సేవకు (2)          ||చాలయ్యా||

నా స్థితి మార్చి నను రక్షించెను నీ ప్రేమ
నను దీవించి హెచ్చించినది నీ ప్రేమ (2)
ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు
నా జీవమర్పింతు నీ సేవకు (2)          ||చాలయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

బెత్లెహేములో సందడి

పాట రచయిత: ఎన్ మేరీ విజయ్
Lyricist: N Mary Vijay

Telugu Lyrics

బెత్లెహేములో సందడి
పశుల పాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని
మహారాజు పుట్టాడని (2)       ||బెత్లెహేములో||

ఆకాశములో సందడి
చుక్కలలో సందడి (2)
వెలుగులతో సందడి
మిల మిల మెరిసే సందడి (2)       ||బెత్లెహేములో||

దూతల పాటలతో సందడి
సమాధాన వార్తతో సందడి (2)
గొల్లల పరుగులతో సందడి
క్రిస్మస్ పాటలతో సందడి (2)       ||బెత్లెహేములో||

దావీదు పురములో సందడి
రక్షకుని వార్తతో సందడి (2)
జ్ఞానుల రాకతో సందడి
లోకమంతా సందడి (2)       ||బెత్లెహేములో||

English Lyrics

Audio

HOME