సుందరుడా అతి కాంక్షనీయుడా

పాట రచయిత: కృపాల్ మోహన్
Lyricist: Kripal Mohan

Telugu Lyrics


సుందరుడా అతి కాంక్షనీయుడా
నా ప్రియా రక్షకుడా
పరిశుద్ధుడా నా ప్రాణ నాథుడా
నాదు విమోచకుడా
నీ స్వరము మధురం
నీ ముఖము మనోహరము (2)        ||సుందరుడా||

కనబడనిమ్ము వినబడనిమ్ము
నాదు స్నేహితుడా (2)
స్నేహితుడా నా స్నేహితుడా
నా ప్రియుడా నా ప్రాణ నాథుడా (2)

English Lyrics

Audio

ప్రేమింతును నిన్నే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ప్రేమింతును నిన్నే – జీవింతును నీకై
ధ్యానింతును నిన్నే – ప్రకటింతును నీకై
యేసూ… నీవే…
అతి సుందరుడా – అతి శ్రేష్టుడా
నీవే… అతి కాంక్షనీయుడా
నా ప్రాణ ప్రియుడా – నా యేసయ్యా       ||ప్రేమింతును||

నీతోనే నేనెల్లప్పుడు జీవింతును యేసయ్యా
ప్రతి దినము నీ రాకడకై నేనెదురు చూచెదనయ్యా (2)
నీ రెక్కల నీడలో నన్ను కాపాడావు
నా జీవిత కాలమంతా నిన్నే కీర్తింతునయ్యా (2)        ||యేసూ||

నీ ముఖము అతి మనోహరం సూర్య కాంతి మించినది
నీ స్వరము అతి మధురం తేనె కంటె తీయనిది (2)
షాలేము రాజా సమాధాన కర్తా
రక్షణ పాత్ర చేత బూని ఆరాధింతునయ్యా (2)        ||యేసూ||

English Lyrics

Audio

దవలవర్ణుడా

పాట రచయిత: ప్రవీణ్ కుమార్
Lyricist: Praveen Kumar

Telugu Lyrics


దవలవర్ణుడా రత్నవర్ణుడా
పదివేలలో అతిప్రియుడా
అతి కాంక్షనీయుడా (2)
ఎందుకయ్యా మాపై ప్రేమ
ఎందుకయ్యా మాపై కరుణ (2)

ఘోర పాపినైన నన్ను
లోకమంతా వెలివేసినా
అనాథగా ఉన్న నన్ను
ఆప్తులంతా దూషించగా (2)
నీ ప్రేమ నన్నాదుకొని
నీ కరుణ నన్నోదార్చెను (2)

గాయములతో ఉన్న నన్ను
స్నేహితులే గాయపరచగా
రక్తములో ఉన్న నన్ను
బంధువులే వెలివేసినా (2)
నీ రక్తములో నను కడిగి
నీ స్వారూపము నాకిచ్చితివా (2)

అర్హత లేని నన్ను నీవు
అర్హునిగా చేసితివి
నీ మహిమలో నిలబెట్టుటకు
నిర్దోషిగా చేసితివి (2)
నీ సేవలో నను వాడుకొని
నీ నిత్య రాజ్యము చేర్చితివి (2)        ||దవలవర్ణుడా||

English Lyrics

Audio

HOME