స్తోత్రించెదము

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

స్తోత్రించెదము దైవకుమారుని – నూతన జీవముతో (2)
నిరంతరము మారని రాజును – ఘనంబు చేయుదము (2)

యేసు మా రక్షకుడు – కల్మషము లేనివాడు (2)
సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ (2)

భయంకరమైన భీతిని గొల్పెడు – జిగట ఊబినుండి (2)
బలమైన హస్తముతో నన్ను ఎత్తి – బండపై స్థిరపరచెన్ (2)     ||యేసు||

కనుపాపగ నను కాయు ప్రభుండు – కునుకడు నిద్రించడు (2)
తనచేతిలో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము (2)     ||యేసు||

తల్లిదండ్రియు యెడబాసినను – విడువక కాయును (2)
ఎల్లప్పుడు నేను భజియించెదను – వల్లభుడేసు ప్రభున్ (2)     ||యేసు||

ఆత్మీయ పోరాటమునకు ప్రభువు – ఆత్మశక్తినిచ్చెన్ (2)
స్తుతియు నీకే ఘనతయు నీకే – యుగయుగములలోన (2)     ||యేసు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ప్రభువా ఈ ఆనందం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ప్రభువా ఈ ఆనందం
నాలో కలిగిన వైనం
వర్ణింపలేనిది ఈ అద్భుతం (2)
నీలో నేను ఉండగా
నాలో నీవు నిలువగా
నీకై నేను పాడగా ఆనందం (2)
ప్రెయసెస్ టు హెవెన్లీ ఫాదర్
ప్రెయసెస్ టు సేవియర్ క్రైస్ట్
ప్రెయసెస్ టు ద లార్డ్ ఆఫ్ ట్రినిటీ (2)      ||ప్రభువా||

ఆత్మలో ఆనందం నా ప్రియుని బహుమానం
అంతమే లేనిది ఆ ప్రేమ మకరందం (2)
వర్ణింపలేనిది సరిపోల్చలేనిది
నా ప్రభునిలో ఆనందం (2)      ||ప్రెయసెస్||

స్వాతంత్య్రం ఇచ్చునదే యేసులో ఆనందం
ఆత్మను బలపరచునదే అక్షయమగు ఆనందం (2)
పరలోకపు మార్గములో నను నడువ చేయునది
ప్రభు యేసుని వాక్యాహారం (2)      ||ప్రభువా||

English Lyrics

Audio

ధన్యము ఎంతో ధన్యము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ధన్యము ఎంతో ధన్యము – యేసయ్యను కలిగిన జీవితము (2)
ఇహమందున పరమందున – నూరు రెట్లు ఫలముండును (2)
వారె ధన్యులు – వారెంతో ధన్యులు (2)          ||ధన్యము||

ఎవరి అతిక్రమములు – పరిహరింపబడెనో (2)
ఎవరి పాపములు – మన్నించబడెనో (2)          ||వారె ధన్యులు||

క్రీస్తు యేసుకు సమర్పించు – కరములే కరములు (2)
క్రీస్తుయేసు స్వరము విను – వీనులే వీనులు (2)          ||వారె ధన్యులు||

ప్రభు యేసుని సేవచేయు – పాదములే సుందరములు (2)
ప్రభుని గూర్చి పాటపాడు – పెదవులే పెదవులు (2)          ||వారె ధన్యులు||

ఆత్మలో నిత్యము – ఎదుగుచున్న వారును (2)
అపవాది తంత్రములు – గుర్తించు వారును (2)          ||వారె ధన్యులు||

శ్రమలయందు నిలచి – పాడుచున్న వారును (2)
శత్రు బాణములెల్ల – చెదరగొట్టు వారును (2)          ||వారె ధన్యులు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME