కలువరి సిలువ

పాట రచయిత: కే ఎబినేజర్
Lyricist: K Ebinezer

Telugu Lyrics


కలువరి సిలువ సిలువలో విలువ
నాకు తెలిసెనుగా
కలుషము బాపి కరుణను చూపి
నన్ను వెదికెనుగా (2)
అజేయుడా విజేయుడా
సజీవుడా సంపూర్ణుడా (2)    ||కలువరి||

కష్టాలలోన నష్టాలలోన
నన్నాదుకొన్నావయ్యా
వ్యాధులలోన బాధలలోన
కన్నీరు తుడిచావయ్యా (2)
మధురమైన నీ ప్రేమ
మరువగలనా ఆ ప్రేమ (2)
అనుక్షణం నీ ఆలోచన
నిరంతరము నాకు నీవిచ్చిన       ||కలువరి||

పాపానికైనా శాపానికైనా
రక్తాన్ని కార్చావయ్యా
దోషానికైనా ద్వేషానికైనా
మరణించి లేచావయ్యా (2)
మధురమైన నీ ప్రేమ
మరువగలనా ఆ ప్రేమ (2)
అనుక్షణం నీ ఆలోచన
నిరంతరము నాకు నీవిచ్చిన       ||కలువరి||

English Lyrics

Audio

నా జీవిత వ్యధలందు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


నా జీవిత వ్యధలందు యేసే జవాబు
యేసే జవాబు – ప్రభు యేసే జవాబు (2)       ||నా జీవిత||

తీరని మమతలతో ఆరని మంటలలో
ఆశ నిరాశలతో తూలెను నా బ్రతుకే (2)
నను గని వచ్చెను – తన కృప నిచ్చెను
కరుణతో ప్రేమించి – కలుషము బాపెను        ||నా జీవిత||

చీకటి వీధులలో నీటుగా నడచితిని
లోకపు ఉచ్ఛులలో శోకము జూచితిని (2)
నను గని వచ్చెను – తన కృప నిచ్చెను
కరుణతో ప్రేమించి – కలుషము బాపెను        ||నా జీవిత||

హంగుల వేషముతో రంగుల వలయములో
నింగికి నేనెగిరి నేలను రాలితిని (2)
నను గని వచ్చెను – తన కృప నిచ్చెను
కరుణతో ప్రేమించి – కలుషము బాపెను        ||నా జీవిత||

English Lyrics

Audio

సన్నుతింతుమో ప్రభో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సన్నుతింతుమో ప్రభో
సదమలమగు భక్తితో (2)
కన్న తండ్రి కావుమా (2)
కలుషము నెడబాపుమా         ||సన్నుతింతుమో||

నీతి సూర్య తేజమా
జ్యోతి రత్న రాజమా (2)
పాతక జన రక్షకా (2)
పతిత పావన నామకా         ||సన్నుతింతుమో||

మానవ సంరక్షకా
దీన నిచయ పోషకా (2)
దేవా మానవ నందనా (2)
దివ్య సుగుణ మందనా         ||సన్నుతింతుమో||

ప్రేమ తత్వ బోధకా
క్షేమ దాత వీవెగా (2)
కామిత ఫలదాయక (2)
స్వామి యేసు నాయక         ||సన్నుతింతుమో||

పాప చింతలన్నిటిన్
పారదోలుమో ప్రభో (2)
నీ పవిత్ర నామమున్ (2)
నిరతము స్మరియించెదన్         ||సన్నుతింతుమో||

English Lyrics

Audio

HOME