నాకై నా యేసు కట్టెను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నాకై నా యేసు కట్టెను
సుందరము బంగారిల్లు
కన్నీరును కలతలు లేవు
యుగయుగములు పరమానందం

సూర్య చంద్రులుండవు
రాత్రింబగులందుండవు
ప్రభు యేసు ప్రకాశించును
ఆ వెలుగులో నేను నడచెదను

జీవ వృక్షమందుండు
జీవ మకుట మందుండు
ఆకలి లేదు దాహం లేదు
తిని త్రాగుట యందుడదు

English Lyrics

Audio

Download Lyrics as: PPT

అయ్యా నా కోసం కల్వరిలో

పాట రచయిత: భరత్
Lyricist: Bharath

Telugu Lyrics

అయ్యా నా కోసం కల్వరిలో
కన్నీరును కార్చితివా (2)
నశించిపోవు ఈ పాపి కొరకై
సిలువను మోసితివా
అయ్యా వందనమయ్యా
యేసు వందనమయ్యా (2)          ||అయ్యా||

పడిపోయి ఉన్న వేళలో
నా చేయి పట్టి లేపుటకు
గొల్గొతా కొండపై పడిపోయిన
యేసు నా కొరకు తిరిగి లేచితివి (2)          ||అయ్యా వందనమయ్యా||

అనాథ నేను కాదని
సిలువపై నాకు చెప్పుటకు
ఒంటరిగా ఉన్న మరియను
యేసు యోహానును అప్పగించితివి (2)          ||అయ్యా వందనమయ్యా||

English Lyrics

Audio

HOME