నీ కంటిపాపను

పాట రచయిత: జాషువా షేక్
Lyricist: Joshua Shaik

Telugu Lyrics

నీ కంటిపాపను – నా కంటనీరు చూడలేవు
నీ చల్లని చూపులో – నేనుందును నీ కృపలో (2)
యేసయ్యా.. యేసయ్య.. ఏ అడ్డూ వద్దయ్యా
నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా (2)

కన్నవారు నీ దారి నీదన్నారు
నమ్మినవారే నవ్విపోయారు
విరిగి నలిగి నీవైపు చూశాను
తల్లివై తండ్రివై నన్నాదుకున్నావు      ||యేసయ్యా||

ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు
ఎంతగానో ప్రేమించి లాలించావు
నా ఊపిరీ నా ప్రాణమూ
నీ దయలోనే నా జీవితం      ||యేసయ్యా||

నీ మాటలో నా బాటను
నీ ప్రేమలో నా పాటను
సాగిపోనీ నా యాత్రనూ
నీ దరి నేను చేరువరకు      ||యేసయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

కంట నీరేల

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics


కంట నీరేల? కలతలు ఏల?
యేసుతో నీవు సాగు వేళ
శోధన వేళ రోదన ఏల?
నీ విశ్వసము గెలిచే వేళ (2)
నమ్మిన ఆ దేవుడు – ఎన్నడు మరచిపోడు
నీయొక్క అవసరాలు – ఏనాడో తానెరిగాడు        ||కంట||

వలదు చింతన దేనికైనా
విన్నవించుము నీ నివేదన (2)
పొందితినను నీదు నమ్మకము
దరికి చేర్చును తగిన విజయము (2)
తిరుగన్నదే లేనివి – ఆ తండ్రి దీవెనలు
పొరపాటు ఎరుగనివి – తానిచ్చు ఆ మేలులు (2)        ||కంట||

రేపు గూర్చిన భయము వలదు
ప్రతి దినము తగు బాధ కలదు (2)
నీదు భారము మోయు ఆ దేవుడు
నీకు ముందుగా నడుచు ఎల్లప్పుడు (2)
నీలోని ఆ భయము – లోకానికి ప్రతిరూపం
స్థిరమైన నీ విశ్వాసం – దేవునికి సంతోషం (2)          ||కంట||

English Lyrics

Audio

HOME