హల్లే హల్లే హల్లే హల్లేలూయా

పాట రచయిత: హనోక్ బోనాల
Lyricist: Hanok Bonala

Telugu Lyrics

హల్లే హల్లే హల్లే హల్లేలూయా
ఆమెన్ హల్లే హల్లే హల్లే హల్లేలూయా (2)
నిను చూడని కనులేల నాకు
నిను పాడని గొంతేల నాకు (2)
నిను ప్రకటింపని పెదవులేల
నిను స్మరియించని బ్రతుకు ఏల (2)      ||హల్లే||

నే పాపిగా జీవించగా
నీవు ప్రేమతో చూచావయ్యా (2)
నాకు మరణము విధియింపగా
నాపై జాలిని చూపితివే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
యేసయ్యా యని మొరపెట్టగా
నీ దయ చేత దృష్టించినావే (2)      ||నిను||

నా శాపము తొలగించినావు
నా దోషము భరియించినావు (2)
నాకు జీవం మార్గం నీవైతివయ్యా
నిత్య నరకాన్ని తప్పించినావు (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
యేసయ్యా యని విలపించగా
నీ కృప చేత రక్షించినావు (2)      ||నిను||

English Lyrics

Audio

కనలేని కనులేలనయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

కనలేని కనులేలనయ్యా
వినలేని చెవులేలనయ్యా
నిను చూడ మనసాయెనయ్యా యేసయ్యా

ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా (2)
అట్టి జీవాహారమైన నిన్ను చూడ లేనట్టి కనులేలనయ్యా            ||కనలేని||

దాహము గొన్న ఓ యేసయ్యా జీవ జలములు నాకిచ్చినావు గదయ్యా (2)
అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా            ||కనలేని||

మరణించావు యేసయ్యా మరణించి నన్ను లేపావుగదయ్యా (2)
అట్టి మరణాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా            ||కనలేని||

రాజ్యమును విడిచిన యేసయ్యా నిత్య రాజ్యము నాకిచ్చావుగదయ్యా (2)
అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా            ||కనలేని||

అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేకన్నా (2)
ఆ కన్నే లేకుండుటయే మేలు నాకు నిను చూసే కన్నియ్య వేసయ్యా            ||కనలేని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME