కరిగే కొడుకు

పాట రచయిత: జాస్పర్ కునపో
Lyricist: Jasper Kunapo

Telugu Lyrics

అన్ని తెలిసిన తల్లి మరియమ్మా
నీ వెన్న మనసులో వేదన ఏందమ్మా
కరిగే కొడుకును కన్నది నువ్వమ్మా
నీ గుండెలో బరువును తీసేదెవరమ్మా
మది సిలువలో తనయుని పలుమార్లు తలచి
నిలువెల్ల వణికి నిదురంత పోయేనా..
పుట్టినరోజులు పండుగలేవమ్మా
ఈ కారణజన్ముడు కరుణామయుడమ్మా
గట్టిగ పట్టిన ఆపగ లేవమ్మా
గొల్గొతా గమనం తప్పదు ఓయమ్మ
అది మనకోసమేనమ్మా…        ||అన్ని తెలిసిన||

గొల్లలంతా కలిసి మెల మెల్లగ చేరిరి
తమ పిల్లన గ్రోవితో లాలిపాటను పాడిరి
తూరుపు దేశపు జ్ఞానుల మంటిరి
నింగి చుక్కను కనుగొని బహు చక్కగా చేరిరి
బంగారం సాంబ్రాణి అర్పించి రారాజు యాజకుడు అని యెంచి
మొకరించి బహుమతులిచ్చి ఆ మహిమంతా మనసుకు తెలిపి
బోళము నెందుకు తెచ్చిరి ఓ యమ్మ
ఆ మరణపు సూచిక కంటివా మరియమ్మా
బోరున వచ్చిన కన్నీరేదమ్మా నీ గుండెను గుచ్చిన తరుణం కదా అమ్మా
అది మనకోసమేనమ్మా…        ||అన్ని తెలిసిన||

ఎనిమిదో దినమున యెరూషలేము వచ్చి
పేరు యేసు అని పెట్టి ఎంతగానో మురిసిరి
సిమోయోను వచ్చెను ఆ శిశువును చూసేను
మహా సంబరపడుచు బహు నెమ్మది నొందెను
తన ఆత్మ నింపబడి ఎత్తుకుని – మన లోక రక్షణ కై ముద్దాడి
తన తనువు చాలింప తృప్తిపడి – ఆ మహిమంతా జనులకు తెలిపి
నీ హృదయములో ఖడ్గము దూరునని
ఆ సిలువలో త్యాగం నీకు నేర్పేనమ్మా
దీవెన నొందిన ధన్యత నీదమ్మా
ఆ మరణము గెలిచిన తనయుని తల్లివమ్మా
అది మనకోసమేనమ్మా…        ||అన్ని తెలిసిన||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME