ఈస్టర్ మెడ్లీ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

యూదా రాజ సింహం తిరిగి లేచెను
తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను (2)

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)
హల్లెలూయా హల్లెలూయా
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ (2)

మరణము జయించి లేచెన్
మరణపు ముల్లును విరచెన్ (2)
మధురం యేసుని నామం
మరువకు యేసుని ధ్యానం (2)

హే ప్రభు యేసు – హే ప్రభు యేసు
హే ప్రభు దేవా సుతా
సిల్వ ధరా, పాప హరా, శాంతి కరా
హే ప్రభు యేసు – హే ప్రభు యేసు

ఖాళీ సమాధిలో మరణమును
ఖైదీగా జేసిన నీవే గదా (2)
ఖాలమయుడగు సాతానుని గర్వము (2)
ఖండనమాయె గదా

సిల్వధరా పాపహరా శాంతికరా
హే ప్రభు యేసు – హే ప్రభు యేసు

గీతం గీతం జయ జయ గీతం
చెయ్యి తట్టి పాడెదము (2)
యేసు రాజు లేచెను హల్లెలూయా
జయ మార్భటించెదము (2)

చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలి నిల్చెను
దైవ సుతుని ముందు

జయ జయ యేసు – జయ యేసు
జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2)
జయ జయ రాజా – జయ రాజా (2)
జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం

సమాధి గెల్చిన జయ యేసు
సమాధి ఓడెను జయ క్రీస్తు (2)
సమరము గెల్చిన జయ యేసు (2)
అమరముర్తివి జయ యేసు

జయ జయ యేసు – జయ యేసు
జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు

పరమ జీవము నాకు నివ్వ
తిరిగి లేచెను నాతో నుండ (2)
నిరంతరము నన్ను నడిపించును
మరల వచ్చి యేసు కొనిపోవును (2)

యేసు చాలును – యేసు చాలును
యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును

ముక్తినిచ్చె యేసు నామం
శాంతినిచ్చె యేసు నామం (2)

జై జై ప్రభు యేసుకు
జై జై క్రీస్తు రాజుకే
మరణమును గెల్చి మము రక్షించి
విజయము నిచ్చెనుగా

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

ప్రాణము పెట్టిన దేవుడు
రక్షణనిచ్చిన దేవుడు
మరణము గెల్చిన దేవుడు
మృతులను లేపిన దేవుడు

దేవుడు దేవుడు యేసే దేవుడు
మన దేవుడు దేవుడు యేసే దేవుడు

సిలువలో ప్రాణం పెట్టాడన్నా
మరణం గెలిచి లేచాడన్నా (2)
మహిమ ప్రభు మృత్యుంజయుడు
క్షమియించును జయమిచ్చును (2)

ఓరన్న… ఓరన్న
యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నా (2)
యేసే ఆ దైవం చూడన్నా – (2)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME