సదాకాలము నీ యందే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


(యేసయ్యా) సదాకాలము – నీ యందే నా గురి
నిలుపుచున్నాను (2)
అక్షయ కిరీటం పొందాలని
అనుక్షణం నే స్తుతియింతును (2)
ఆరాధనా ఆరాధనా
యేసయ్యా నీకే నా ఆరాధనా (2)       ||సదాకాలము||

చుక్కాని లేని నావనై
సంద్రాన నే చిక్కుబడగా (2)
నా దరి చేరి – ఈ ధరలోన
నీ దరి నడిపించావే (2)       ||ఆరాధనా||

అన్య జనులు ఏకమై
నిందలు నాపైన మోపినా (2)
నిందలు బాపి – నన్నాదుకొని
విడువని కృప చూపినావే (2)       ||ఆరాధనా||

నాశనకరమైన ఊభిలో
నేను పది కృంగగా (2)
హస్తము చాచి – నను ఆదుకొని
(నీ) ఆత్మతో బలపరచినావే (2)       ||ఆరాధనా||

English Lyrics

Audio

అడుగడుగున రక్త బింధువులే

Telugu Lyrics


అడుగడుగున రక్త బింధువులే
అణువణువున కొరడా దెబ్బలే (2)
నా యేసుకు ముళ్ల కిరీటం
భుజములపై సిలువ భారం (2)
భుజములపై సిలువ భారం          ||అడుగడుగున||

సిలువ మోయుచు వీపుల వెంట
రక్త ధరలే నిన్ను తడిపెను (2)
నా ప్రజలారా ఏడవకండి
మీ కోసము ప్రార్ధించండి (2)         ||అడుగడుగున||

కలువరిలోన నీ రూపమే
నలిగిపోయెను నా యేసయ్యా (2)
చివరి రక్త బిందువు లేకుండా
నా కోసమే కార్చినావు (2)         ||అడుగడుగున||

మరణము గెలిచి తిరిగి లేచిన
మృత్యుంజయుడా నీకే స్తోత్రం (2)
మహిమ స్వరూపా మా యేసయ్యా
మహిమగా నన్ను మార్చినావా (2)         ||అడుగడుగున||

English Lyrics

Audio

HOME