ఆహా ఆనందమే పరమానందమే

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ఆహా ఆనందమే పరమానందమే
ప్రియ యేసు నొసగె నాకు
కొలత లేనిది బుద్ధికందనిది
ప్రేమన్ వివరింప వీలగునా       ||ఆహా||

నీచ ద్రోహినైన నన్
ప్రేమతో చేర్చుకొనే (2)
పాప ఊభి నుండి నన్
పైకి లేవనెత్తెను (2)       ||ఆహా||

నిత్య నాశన పురమునకు
నే పరుగిడి వెళ్ళుచుండ (2)
నిత్య జీవ మార్గములో
నన్ను నడిపితివి (2)       ||ఆహా||

నీ ప్రేమ స్వరమున్ విని
నేను మేలుకొంటిని (2)
ప్రియుని రొమ్మును చేరను
నాలో వాంఛ ఉప్పొంగుచుండె (2)       ||ఆహా||

మధ్యాకాశము నందున
ప్రభుని చేరెడు వేళలో (2)
ఆనందమానందమే
ఎల్లప్పుడానందమే (2)       ||ఆహా||

English Lyrics

Audio

నీదు ప్రేమకు హద్దు లేదయా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నీదు ప్రేమకు హద్దు లేదయా
నీదు ప్రేమకు కొలత లేదయా
నీదు ప్రేమకు సాటి రారయా.. ఎవ్వరు
పొగడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా       ||నీదు||

తల్లి తండ్రులు చూపలేని ప్రేమ
తనయులివ్వని తేటనైన ప్రేమ (2)
పేదలకు నిరు పేదలకు
విధవలకు అనాథలకు (2)
బంధు మిత్రులు చూపలేని ప్రేమా (2)
కొనియాడదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా      ||నీదు||

నరులకై నర రూపమైన ప్రేమ
పరము చేర్చగ ప్రాణమిచ్చిన ప్రేమ (2)
దొంగలకు వ్యభిచారులకును
కౄరులకు నర హంతకులకు
మనుజులివ్వని మధురమైన ప్రేమా (2)
కీర్తించదగిన ప్రేమమూర్తివి నీవయా.. యేసయ్యా      ||నీదు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

HOME