గగనము చీల్చుకొని

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవ రానైయున్న
ప్రాణప్రియుడా యేసయ్యా (2)
నిన్ను చూడాలని…
నా హృదయమెంతో ఉల్లసించుచున్నది (2)
ఉల్లసించుచున్నది…           ||గగనము||

నీ దయా సంకల్పమే – నీ ప్రేమను పంచినది
నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది (2)
పవిత్రురాలైన కన్యకగా – నీ యెదుట నేను నిలిచెదను (2)
నీ కౌగిలిలో నేను విశ్రమింతును (2)          ||గగనము||

నీ మహిమైశ్వర్యమే – జ్ఞాన సంపదనిచ్చినది
మర్మమైయున్న నీవలె రూపించుచున్నది (2)
కళంకములేని వధువునై – నిరీక్షణతో నిన్ను చేరెదను (2)
యుగయుగాలు నీతో ఏలెదను (2)          ||గగనము||

నీ కృపా బాహుళ్యమే – ఐశ్వర్యమునిచ్చినది
తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది (2)
అక్షయమైన దేహముతో – అనాది ప్రణాళికతో (2)
సీయోనులో నీతో నేనుందును (2)          ||గగనము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

జయించువారిని

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

జయించువారిని కొనిపోవ
ప్రభు యేసు వచ్చుఁను (2)
స్వతంత్రించుకొనెదరుగా
వారే సమస్తమును (2)       ||జయించు||

ఎవరు ఎదురు చూతురో
సంసిద్ధులవుదురు (2)
ప్రభు రాకనేవరాశింతురో
కొనిపోవ క్రీస్తు వచ్చుఁను (2)       ||జయించు||

తన సన్నిధిలో మనలా నిలుపు
నిర్దోషులుగా (2)
బహుమానముల్ పొందెదము
ప్రభుని కోరిక ఇదే (2)       ||జయించు||

సదా ప్రభుని తోడ నుండి
స్తుతి చెల్లింతుము (2)
అద్భుతము ఆ దినములు
ఎవారు వర్ణింపలేరుగా (2)       ||జయించు||

English Lyrics

Audio

HOME