అయ్యా నా కోసం కల్వరిలో

పాట రచయిత: భరత్
Lyricist: Bharath

Telugu Lyrics

అయ్యా నా కోసం కల్వరిలో
కన్నీరును కార్చితివా (2)
నశించిపోవు ఈ పాపి కొరకై
సిలువను మోసితివా
అయ్యా వందనమయ్యా
యేసు వందనమయ్యా (2)          ||అయ్యా||

పడిపోయి ఉన్న వేళలో
నా చేయి పట్టి లేపుటకు
గొల్గొతా కొండపై పడిపోయిన
యేసు నా కొరకు తిరిగి లేచితివి (2)          ||అయ్యా వందనమయ్యా||

అనాథ నేను కాదని
సిలువపై నాకు చెప్పుటకు
ఒంటరిగా ఉన్న మరియను
యేసు యోహానును అప్పగించితివి (2)          ||అయ్యా వందనమయ్యా||

English Lyrics

Audio

యేసు వంటి సుందరుడు

పాట రచయిత: ఎం ఎస్ శాంతవర్ధన్
Lyricist: M S Shanthavardhan

Telugu Lyrics


యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భువిలో
ఎన్నడు నే చూడలేదు ఇక చూడబోనుగా
పరిపూర్ణ సుందరుడు భువిలోన జీవితమునకు
నీవే చాలు వేరేవ్వరు నాదు ప్రియ యేసయ్య
మట్టికోసం మాణిక్యమును విడిచిపెట్టెను
పాడు మట్టికోసం మాణిక్యమును విడిచిపెట్టెను

పరిపూర్ణ సుందరుడు రక్షించుకొంటివి నన్ను
సంపూర్ణముగా నన్ను నీకు అర్పించెదను     ||యేసు||

యెరుషలేము కుమార్తెలు నన్ను చుట్టుముట్టిరి
నీపై నున్న ప్రేమను తొలగించబూనిరి         ||యేసు||

దినదినం నీపై నాప్రేమ పొంగుచున్నది
యేసయ్యా వేగమే వచ్చి నన్ను చేరుము       ||యేసు||

English Lyrics

Audio

ఆశపడకు ఈ లోకం కోసం

పాట రచయిత: యూ యిర్మియా
Lyricist: U Irmiyaa

Telugu Lyrics

ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా
ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా
మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా          ||ఆశపడకు||

ఆశలు రేపే సుందర దేహం – మట్టి బొమ్మ ఓ చెల్లెమ్మా
దేహం కోరేదేదైనా – అది మట్టిలోనే పుట్టిందమ్మా (2)
వెండి బంగారు వెలగల వస్త్రం
పరిమళ పుష్ప సుగంధములు (2)
మట్టిలోనుండి వచ్చినవేనని
మరువబోకు నా చెల్లెమ్మా (2)           ||ఆశపడకు||

అందమైన ఓ సుందర స్త్రీకి – గుణములేక ఫలమేమమ్మా
పంది ముక్కున బంగారు కమ్మీ – పెట్టిన ఫలితం లేదమ్మా (2)
అందమైన ఆ దీనా షెకెములు
హద్దులేక ఏమయ్యిందమ్మా (2)
అంతరంగమున గుణముకలిగిన
శారా చరిత్రకెక్కిందమ్మా (2)           ||ఆశపడకు||

జాతి కొరకు ఉపవాస దీక్షతో – పోరాడిన ఎస్తేరు రాణిలా
నీతి కొరకు తన అత్తను విడువక – హత్తుకున్న రూతమ్మ ప్రేమలా (2)
కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి
తన కురులతో తుడిచిన మగ్దలీనలా (2)
హన్నా వలె మన దోర్కా వలె
ప్రిస్కిల్ల వోలె విశ్వాస వనితలా (2)
వారి దీక్షయే వారసత్వమై
అనంత రాజ్యపు నిత్య స్వాస్థ్యమై (2)
పవిత్రమైన హృదయము కలిగి
ప్రభువు కొరకు జీవించాలమ్మా (2)           ||ఆశపడకు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

మూడునాళ్ళ ముచ్చట కోసం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మూడునాళ్ళ ముచ్చట కోసం
ఈ మనిషి పడే తపన చూడరా (2)
నీటిబుడగలాంటి జీవితం
ఏ నాడు సమసిపోవునో ఎరుగం (2)

మనిషికి తన మనసే చేరసాలరా
మమతలు మమకారాలే బంధాలురా (2)
వల్లకాటి వరకేరా భవబంధాలు
అవి కళ్లానికి చేరవురా అనుబంధాలు (2)
కల్లలైన కళలు మానుకో
ఎల్లవేళలా ప్రభువని వేడుకో (2)            ||మూడునాళ్ళ||

ఇంద్ర ధనుస్సు లాంటిదోయి సంసారము
అది కనిపించీ మాయమయే రంగులవలయం (2)
గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యం
అది పాపానికి జీతమురా మనిషికి మరణం (2)
నిత్యమైన సుఖము వెదకరా
నిరతము ఆ ప్రభుని వేడరా (2)                ||మూడునాళ్ళ||

తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు
అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా (2)
జిగటగల ఊభినుండి పైకి లేపి
నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు (2)
తీర్పు తీర్చబడకమునుపే
తప్పక ఆ ప్రభుని కోరరా (2)                  ||మూడునాళ్ళ||

English Lyrics

Audio

HOME