అన్ని సాధ్యమే యేసులో

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics

నన్ను బలపరచు యేసునందే నేను
సర్వము చేయగలను
నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను
సమస్తం చేయగలను
సాధ్యము కానిది ఏదియు లేదే
అన్ని సాధ్యమే యేసులో
సాధ్యము కానిది ఏదియు లేదే
అన్ని సాధ్యమే క్రీస్తులో        ||నన్ను బలపరచు||

నీటిని చీల్చి – బాటను వేసి – నరులను నడిపించెనే
బండను చీల్చి – దాహము తీర్చ – నీటిని పుట్టించెనే
నీటిని ద్రాక్షా రసముగ మార్చెనే
నీటిపై నడిచెనే – నీటినే అణచెనే
నా కన్నీటిని నాట్యముగ మార్చెనే
జీవ జలమైన నా యేసయ్యా…         ||సాధ్యము||

హోరేబు కొండపై – మండే పొద నుండి – మోషేతో మాట్లాడెనే
బలిపీఠముపై – అగ్నిని కురిపించి – మహిమను కనుపరచెనే
షద్రకు మేషాకు అబేద్నెగోలను
అగ్నిలో ఉండియే కాపాడెనే
నరకపు మంటనుండి నను రక్షించిన
అగ్ని నేత్రాల నా యేసయ్యా…         ||సాధ్యము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

క్రిస్మస్ అంటేనే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన
క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ (2)
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4)

క్రీస్తులోనే విశ్వాసం
క్రీస్తులోనే ఉల్లాసం
క్రీస్తులోనే అభిషేకం
క్రీస్తులోనే సమస్తం (2)
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4)      ||క్రిస్మస్||

యేసులోనే రక్షణ
యేసులోనే స్వస్థత
యేసులోనే విడుదల
నమ్మితే నిత్య జీవం (2)
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4)      ||క్రిస్మస్||

English Lyrics

Audio

దేవుని గొప్ప మహిమను

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics


దేవుని గొప్ప మహిమను చూసి తిరిగి పాపం చేసెదవా?
ద్వంద నీతికి నిష్కృతి లేదని నీకు తెలుసా ఓ క్రైస్తవా! (2)
ఎంత అధము అన్యుల కన్న, ఎంత ఘోరము ఆ యూద కన్న
వలదు పాపం ఇకపైనన్న, తిరిగి పొందు క్రీస్తులో  మన్నా  (2)

మరచినవా నీ అపజయములు
గుర్తు లేదా! ఆ శోధనలు
నీవు చూపిన ఆ వినయములు
ఏడ్చి చేసిన ఆ ప్రార్థనలు
తండ్రి నీవే దిక్కంటూ,  మోకరిల్లిన ఆ క్షణము
అందుకొంటివి విజయములు, విడిచి పెడితివి వాక్యములు (2)  ॥ఎంత॥

అందుకొంటివి బాప్తిస్మమును
పొందు కొంటివి ఆ రక్షణను
వదలబోకు ఆత్మీయతను
చేరనివ్వకు నిర్లక్ష్యమును
తీర్పు తీర్చే సమయంలో ఓర్పు దొరకదు గుర్తెరుగు
నిత్య జీవం లో నుండి, ఘోర నరకం చేరెదవా?  (2)  ॥ఎంత॥

English Lyrics

Audio

క్రీస్తులో జీవించు నాకు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


క్రీస్తులో జీవించు నాకు – ఎల్లప్పుడు జయముండును
జయముంది జయముంది – జయముంది నాకు (2)

ఎటువంటి శ్రమలొచ్చినా – నేను దిగులు పడను ఇలలో (2)
ఎవరేమి చెప్పిననూ – నేను సోలిపోనెప్పుడూ (2)     ||జయముంది||

నా రాజు ముందున్నాడు – గొప్ప జయముతో వెళ్లుచున్నాడు (2)
మట్టలను చేత పట్టి – నేను హోసన్నా పాడెదను (2)     ||జయముంది||

సాతాను అధికారమున్ – నా రాజు తీసివేసెను (2)
సిలువలో దిగగొట్టి – యేసు కాళ్లతో త్రొక్కి వేసెను (2)     ||జయముంది||

English Lyrics

Audio

HOME