నీ కృప లేనిచో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నీ కృప లేనిచో ఒక క్షణమైననూ
నే నిలువజాలనో ప్రభు (2)

నీ కృప లేనిచో ఒక క్షణమైననూ
నే నిలువజాలనో ప్రభు (2)
ప్రతి క్షణం కనుపాపలా
నను కాయుచున్న దేవుడా (2)        ||నీ కృప||

ఈ ఊపిరి నీదేనయ్యా
నీవిచ్చిన దానం నాకై
నా ఆశ నీవేనయ్యా
నా జీవితమంతా నీకై (2)
నిను నే మరతునా మరువనో ప్రభు
నిను నే విడతునా విడువనో ప్రభు (2)        ||నీ కృప||

నా ఐశ్వర్యమంతా నీవే
ఉంచినావు నీ దయ నాపై
నీ దయ లేనిచో నాపై
ఉందునా ఈ క్షణమునకై (2)
కాచి ఉంచినావయ్యా – ఇంత వరకును
నను వీడిపోదయ్యా – నాకున్న నీ కృప (2)        ||నీ కృప||

English Lyrics

Audio

నీ జీవితం క్షణ భంగురం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నీ జీవితం క్షణ భంగురం
గమ్యంబులేని వేదనల వలయం (2)
నీ పాప హృదయం తెరువుము ఈ క్షణం (2)
దేవుని ప్రేమను రుచి చూడు ఈ క్షణం          ||నీ జీవితం||

ఏది సత్యం ఏది నిత్యం – ఏది మాన్యం ఏది శూన్యం
సరి చూసుకో ఇప్పుడే – సరి చేసుకో (2)
ప్రభు యేసు నీ కొరకు బలి ఆయె కల్వరిలో
గమనించుమా ప్రియ నేస్తమా (2)          ||నీ జీవితం||

కష్టాలు ఎన్నైనా నష్టాలు ఎదురైనా
నీ సర్వ భారమంతా – యేసు పైన వేయుమా (2)
నీ హృదయ భారం తీరును ఈ క్షణం
దిగులు పడకుమా ప్రియ నేస్తమా (2)         ||నీ జీవితం||

English Lyrics

Audio

HOME