నీ జీవితం విలువైనది

పాట రచయిత: దేవరాజు జక్కి
Lyricist: Devaraju Jakki

Telugu Lyrics

నీ జీవితం విలువైనది
ఏనాడు ఏమరకు
శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం
ఈనాడే యోచించుమా
ఓ నేస్తమా తెలియునా
ప్రభు యేసు నిన్ను పిలిచెను
నా నేస్తమా తెలిసికో
ప్రభు యేసు నీకై మరణించెను            ||నీ జీవితం||

బలమైన పెను గాలి వీచి
అలలెంతో పైపైకి లేచి (2)
విలువైన నీ జీవిత నావా
తలకిందులై వాలిపోవ
వలదు భయము నీకేలా
కలదు యేసే నీ తోడు
యేసు మరణించి మరి లేచెను
నిన్ను ప్రేమించి దరి చేర్చును       ||నీ జీవితం||

గాఢాంధకారంపు లోయలో
వల గాలి వడి సవ్వడిలో (2)
నడయాడి నీ జీవిత త్రోవా
సుడివడి నీ అడుగు తడబడిన
వలదు భయము నీకేలా
కలదు యేసే నీ తోడు
యేసు మరణించి మరి లేచెను
నిన్ను ప్రేమించి దరి చేర్చును       ||నీ జీవితం||

కనలేని గమ్యంబు కోరి
ఎనలేని కష్టాల పాలై (2)
మనలేని నీ జీవిత గాథా
కలలన్ని కన్నీటి వ్యథలే
వలదు భయము నీకేలా
కలదు యేసే నీ తోడు
యేసు మరణించి మరి లేచెను
నిన్ను ప్రేమించి దరి చేర్చును       ||నీ జీవితం||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఎంతో మధురం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఎంతో మధురం నా యేసు ప్రేమ
ఎంతో క్షేమం నా తండ్రి చెంత (2)
ఎనలేని ప్రేమను నాపైన చూపి
ప్రాణంబు పెట్టిన మన తండ్రి ప్రేమ (2)            ||ఎంతో||

నా నీతికి ఆధారము
నా త్రోవకు వెలుగువై (2)
దుష్టుల ఆలోచన చొప్పున నడువక
పాపుల మార్గమున నిలువక (2)            ||ఎంతో||

పరిశుద్ధులకు పరిశుద్ధుడవు
ప్రభులకు ప్రభుడవు నా యేసయ్యా (2)
ఈ పాప లోకంలో నీ ప్రాణమర్పించి
పరలోకమునకు మార్గము చూపావు (2)            ||ఎంతో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME