జయం జయం (మనకూ)

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


జయం జయం జయం జయం
జయం జయం జయం జయం (2)
మనకూ జయం మనకూ జయం
నాకూ జయం నీకూ జయం     ||జయం||

యేసు ప్రభువు రక్తమే పాపముపై జయం
క్రీస్తు యేసు నామమే సాతనుపై జయం (2)
సిలువ పైన మరణమే మరణముపై జయం
కల్వరిలో త్యాగమే నరకముపై జయం (2)       ||జయం||

ఆ కొరడా దెబ్బలే శ్రమలపై జయం
ఆ ముండ్లకిరీటమే బంధకముపై జయం (2)
గాయ పడిన హస్తమే కన్నీటిపై జయం
దప్పిగొన్న ప్రాణమే నిరాశలపై జయం (2)       ||జయం||

ఆ మధుర ప్రేమయే ద్వేషముపై జయం
ఆ దివ్య వాక్యమే లోకముపై జయం (2)
పరిశుద్ధాత్మ తోడుయే భయముపై జయం
ప్రార్ధనశక్తి వరములే బలహీనతపై జయం (2)       ||జయం||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

పుట్టె యేసుడు నేడు

పాట రచయిత: ఫేలిక్స్ అండ్రు
Lyricist: Felix Andrew

Telugu Lyrics

పుట్టె యేసుడు నేడు – మనకు – పుణ్య మార్గము జూపను
పట్టి యయ్యె బరమ గురుఁడు – ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసు        ||పుట్టె||

ధర బిశాచిని వేడిన – దు –ర్నరుల బ్రోచుటకై యా
పరమవాసి పాపహరుఁడు – వరభక్త జన పోషుడు (2)     ||పుట్టె||

యూద దేశములోన – బెత్లె -హేమను గ్రామమున
నాదరింప నుద్భవించెను – అధములమైన మనలను (2)     ||పుట్టె||

తూర్పు దేశపు జ్ఞానులు – పూర్వ – దిక్కు చుక్కను గాంచి
సర్వోన్నతుని మరియ తనయుని – మ్రొక్కిరి అర్పణంబులిచ్చిరి (2)     ||పుట్టె||

English Lyrics

Audio

భయము లేదు మనకు

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics


భయము లేదు మనకు
ఇకపై ఎదురు వచ్చు గెలుపు
అదిగో యేసు పిలుపు
వినుమా పరము చేరు వరకు (2)
ఫలితమేదైన ప్రభును వీడకు
కష్టమెంతైన కలత చెందకు
అలుపు లేకుండ పరుగు సాగని
శోధనలు నిన్ను చూసి బెదరని          ||భయము||

సంధించిన బాణమల్లె నీ గురి కొనసాగని
మన తండ్రి వాగ్ధానాలే ఊపిరిగా మారని (2)
కష్టాలే మెట్లుగా మారి యేసులో ఎదిగించని
తన వాక్యం నీలో వెలిగి చీకటి తొలగించని (2)           ||ఫలిత||

మండించే అగ్గితోనే మెరయును బంగారము
శోధనల కొలిమిలోనే బలపడు విశ్వాసము (2)
నీ తరపున యుద్ధం చేసే యెహోవా నీ అండ
తొలగిపోకు ఆ మార్గన్నీ తన ఆజ్ఞను వినకుండా (2)           ||ఫలిత||

కనలేదా సిలువలోన యేసు రాజు కష్టము
తానొందిన శ్రమల ద్వారా నశియించే పాపము (2)
నీ శ్రమల కాలంలోనే మనసు దృఢము కావాలి
తిరిగి నీలో పుట్టే పాపం బీజము నశియించాలి (2)           ||ఫలిత||

ప్రియమైన పుత్రుని మనకై నలిగించిన దేవుడు
అప్పగించలేడా సకలం సర్వశక్తిమంతుడు (2)
తన సన్నిధి రావాలంటూ నిన్ను కోరుతున్నాడు
నీతి నీలో పెంచేటందుకు తపన పడుతూ ఉన్నాడు (2)           ||ఫలిత||

English Lyrics

Audio

HOME