తెల్లారింది వేళ

పాట రచయిత: శామ్యూల్ కర్మోజి
Lyricist: Samuel Karmoji

Telugu Lyrics


అన్నయ్య… తెల్లారింది లేరా..
తెల్లారింది వేళ – త్వరగా నిద్దుర లేరా
మనమంతా ఆయన సృష్టే రా
పక్షుల కోలాహ వేళ – ప్రభువును స్తుతించావేరా
వాటి కంటె శ్రేష్ఠుల మనమేరా (2)

అడవి రాజు సింహమైననూ – ఆకలంటు పిల్లలన్ననూ
యేసు రాజు పిల్లలం మనం – పస్తులుంచునా (2)
వాడిపోవు అడవి పూలకు – రంగులేసి అందమిచ్చెను
రక్తమిచ్చి కొన్న మనలను – మరచిపోవునా (2)
మరచిపోవునా               ||తెల్లారింది||

చిన్నదైన పిచ్చుకైననూ – చింత ఉందా మచ్ఛుకైననూ
విత్తలేదు కోయలేదని – కృంగిపోవునా (2)
వాటికన్ని కూర్చువాడు – నీ తండ్రి యేసేనని
నీకు ఏమి తక్కువ కాదని – నీకు తెలియునా (2)
నీకు తెలియునా               ||తెల్లారింది||

English Lyrics

Audio

జగతికి వెలుగును తెచ్చెనులే

పాట రచయిత: సిరివెళ్ల హనోక్
Lyricist: Sirivella Hanok

Telugu Lyrics


జగతికి వెలుగును తెచ్చెనులే – క్రిస్మస్ క్రిస్మస్
వసంత రాగం పాడెనులే – క్రిస్మస్ క్రిస్మస్
రాజుల రాజు పుట్టిన రోజు – క్రిస్మస్ క్రిస్మస్
మనమంతా పాడే రోజు – క్రిస్మస్ క్రిస్మస్ (2)

ఈ రాత్రిలో కడు దీనుడై
యేసు పుట్టెను బెత్లెహేములో (2)
తన స్థానం పరమార్ధం విడిచాడు నీకై
నీ కోసం నా కోసం పవళించే పాకలో (2)        ||జగతికి||

ఇమ్మానుయేలుగా అరుదించెను
దైవ మానవుడు యేసు దేవుడు (2)
నీ తోడు నా తోడు ఉంటాడు ఎప్పుడు
ఏ లోటు ఏ కీడు రానీయదు ఎన్నడు (2)         ||జగతికి||

English Lyrics

Audio

అంబరానికి అంటేలా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


లాల లాలలలా లాలలలా లా లా లా… లాల లాలలలాలా (2)
అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం (2)
సంగీత స్వరాలతో ఈ మాట అందరికి చక్కగ చాటి చెప్పుదాం (2)        ||లాల||

దివి నుండి దీనుడిగా భువికి ఏతెంచినాడు
దీనులను రక్షించే దేవ తనయుడు (2)
దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలిచ్చె
విజయ వీరుడై ఉద్భవించెనే (2)
పశుల పాకలో పరుండియుండెనే         ||లాల||

ఆ నాడు ఒక తార జ్ఞానులకు తెలియజేసే
లోకానికి రక్షకుడు వెలిసెనని (2)
తార వెంబడి వెళ్లి వారు
కానుకలర్పించి ఆరాధించారు (2)
ఆత్మ పూర్ణులై తిరిగి వెళ్లిరి         ||లాల||

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
సమాధానమిచ్ఛే ఈ చిన్ని బాలుడే (2)
పొత్తి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు
దూత గణములే జోల పాడగా (2)
సృష్టికి బహు సంబరమాయెగా         ||లాల||

English Lyrics

Audio

HOME