ప్రభుని స్మరించు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ప్రభుని స్మరించు – ప్రభుని స్మరించు
ఓ మనసా! నా మనసా! (2)

నీ ప్రేమ ధాటికి – సాటియే లేదు (2)
నీ మహిమే మేటి (3)        || ప్రభుని ||

ప్రభూ నీ శరణాగతులగువారు (2)
విడుదల నొందెదరు (3)        || ప్రభుని ||

పాపుల కొరకై సిలువను మోసి (2)
ప్రాణంబిడె నిలలో (3)        || ప్రభుని ||

మా ప్రభువా మా మొరనాలించి (2)
నీ జ్ఞానంబిమ్ము (3)        || ప్రభుని ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

శాశ్వతమా ఈ దేహం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


శాశ్వతమా ఈ దేహం
త్వరపడకే ఓ మనసా…

శాశ్వతమా ఈ దేహం
త్వరపడకే ఓ మనసా (2)

క్షణికమైన ఈ మనుగడలో
పరుగులేలనో అనుక్షణము
నీటిపైన చిరు బుడగ వోలె – (2)
దేహము ఏ వేళా చితికిపోవునో        ||శాశ్వతమా||

ఈ లోకములో భోగములెన్నో
అనుభవించగా తనవి తీరేనా
నీ తనువే రాలిపోయినా – (2)
నీ గతి ఏమో నీకు తెలియునా        ||శాశ్వతమా||

దేహ వాంఛలను దూరము చేసి
ఆ ప్రభు యేసుని శరణము కోరి
నీతి మార్గమున నడుచుకొందువో – (2)
చిరజీవముతో తరియించేవు        ||శాశ్వతమా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

సోలిపోయిన మనసా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

సోలిపోయిన మనసా నీవు
సేదదీర్చుకో యేసుని ఒడిలో
కలత ఏలనో కన్నీరు ఏలనో
కర్త యేసే నీతో ఉండగా
ప్రభువు నీ చేయి వీడడు ఎన్నడు – (2)
యేసులో నీ కోరిక తీరునుగా       ||సోలిపోయిన||

యేసు ప్రేమను నీవెరుగుటచే
దూరమైన నీ వారే (2)
కన్న తల్లే నిను మరచిననూ
యేసు నిన్ను మరువడెన్నడు (2)

శ్రమకు ఫలితం కానలేక
సొమ్మసిల్లితివా మనసా (2)
కోత కాలపు ఆనందమును
నీకొసగును కోతకు ప్రభువు (2)

ఎంత కాలము కృంగిపోదువు
నీ శ్రమలనే తలచుచు మనసా (2)
శ్రమపడుచున్న ఈ లోకమునకు
క్రీస్తు నిరీక్షణ నీవై యుండగ (2)

సోలిపోకుము ఓ ప్రియ మనసా
సాగిపో ఇక యేసుని బాటలో
కలత వీడు ఆనందించు
కర్త యేసే నీతో ఉండగా
కలతకు ఇక చావే లేదు – (2)
యేసు కోరికనే నెరవేర్చు         ||సోలిపోకుము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

దేవ సంస్తుతి

పాట రచయిత: ముంగమూరి దేవదాసు
Lyricist: Mungamoori Devadasu

Telugu Lyrics


దేవ సంస్తుతి చేయవే మనసా
శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని
పావన నామము నుతించుమా – నా యంతరంగము
లో వసించు నో సమస్తమా          ||దేవ||

జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు (2)
నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బు
లేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే          ||దేవ||

చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను (2)
జీవ కిరీటముగ వేయును – నీ శిరసు మీద
జీవ కిరీటముగ వేయును – ఆ కారణముచే          ||దేవ||

యవ్వనంబు పక్షిరాజు – యవ్వనంబు వలెనే క్రొత్త (2)
యవ్వనంబై వెలయునట్లుగా – మే లిచ్చి నీదు
భావమును సంతుష్టిపరచునుగా – ఆ కారణముచే          ||దేవ||

ప్రభువు నీతి పనులు చేయును – బాధితులకు న్యాయ మిచ్చున్ (2)
విభుండు మార్గము తెలిపె మోషేకు – దన కార్యములను
విప్పె నిశ్రాయేలు జనమునకు – ఆ కారణముచే          ||దేవ||

అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2)
నిత్యము వ్యాజ్యంబు చేయడు – ఆ కృపోన్నతుడు
నీ పయి నెపుడు కోప ముంచడు – ఆ కారణముచే          ||దేవ||

పామరుల మని ప్రత్యుపకార – ప్రతి ఫలంబుల్ పంపలేదు (2)
భూమి కన్న నాకాసంబున్న – ఎత్తుండు దైవ
ప్రేమ భక్తి జనులయందున – ఆ కారణముచే          ||దేవ||

పడమటికి తూర్పెంత ఎడమో – పాపములను మనకు నంత (2)
ఎడము కలుగజేసియున్నాడు – మన పాపములను
ఎడముగానే చేసియున్నాడు – ఆ కారణముచే          ||దేవ||

కొడుకులపై తండ్రి జాలి – పడు విధముగా భక్తిపరుల (2)
యెడల జాలి పడును దేవుండు – తన భక్తిపరుల
యెడల జాలిపడును దేవుండు – ఆ కారణముచే          ||దేవ||

మనము నిర్మితమయిన రీతి – తనకు దెలిసియున్న సంగతి (2)
మనము మంటి వారమంచును – జ్ఞాపకము చేసి
కొనుచు కరుణ జూపుచుండును – ఆ కారణముచే          ||దేవ||

పూసి గాలి వీవ నెగిరి – పోయి బసను దెలియని వన (2)
వాస పుష్పము వలెనె నరుడుండు – నరు నాయువు తృణ
ప్రాయము మన దేవ కృప మెండు – ఆ కారణముచే          ||దేవ||

పరమ దేవ నిబంధ నాజ్ఞల్ – భక్తితో గైకొను జనులకు (2)
నిరతమును గృప నిలిచి యుండును – యెహోవ నీతి
తరములు పిల్లలకు నుండును – ఆ కారణముచే          ||దేవ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME