మేలులు నీ మేలులు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2)
నా ప్రాణమున్నంత వరకు
విడచిపోలేనయ్యా       ||మేలులు||

కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా
శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2)
నీది గొర్రెపిల్ల మనస్సయ్యా
యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా – (3)

అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా
జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2)
నీది పావురము మనస్సయ్యా
యేసయ్యా.. పావురము మనస్సయ్యా – (3)

చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా
దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2)
నీది ప్రేమించే మనస్సయ్యా
యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా – (3)

English Lyrics

Audio

నాకెన్నో మేలులు చేసితివే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నాకెన్నో మేలులు చేసితివే
నీకేమి చెల్లింతును – దేవా నీకేమి అర్పింతును (2)
హల్లెలూయా యేసునాథా – కృతజ్ఞతా స్తుతులివే (2)         ||నాకెన్నో||

కృప చేత నన్ను రక్షించినావే
కృప వెంబడి కృపతో – నను బలపరచితివే
నన్నెంతగానో ప్రేమించినావే
నా పాపమును కడిగి – పరిశద్ధపరచితివే (2)          ||హల్లెలూయా||

నాకిక ఆశలు లేవనుకొనగా
నా ఆశ నీవైతివే – ఆశలు తీర్చితివే
నలుదిశల నన్ను భయమావరింప
నా పక్షమందుంటివే – నాకభయమిచ్చితివే (2)          ||హల్లెలూయా||

నా కాడి మోసి నా తోడు నీవే
నీ చేతి నీడలో – నను దాచియున్నావే
ఏ కీడు నాకు రాకుండ చేసి
నీ జాడలో నన్ను- నడిపించుచున్నావే (2)          ||హల్లెలూయా||

నీ రాజ్యమందు నను చేర్చుకొందువు
రానున్న రారాజువు – నా రాజువు నీవు
నీ వధువు సంఘమున నను చేర్చుకొన్నావు
నను కొన్నవాడవు – నా వరుడవు నీవు (2)          ||హల్లెలూయా||

English Lyrics

Audio

ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా

పాట రచయిత: శుభాకర్ రావు
Lyricist: Shubhakar Rao

Telugu Lyrics

ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2)
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ (2)      ||ఎన్నో||

బాధలలో మంచి బంధువువైనావు
వ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2)
చీకటి బ్రతుకులో దీపము నీవై
పాపములన్నియు కడిగిన దేవా (2)
నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా
నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)           ||ఎన్నో||

శోధనలో సొంత రక్షకుడైనావు
శ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు (2)
హృదయ వేదన తొలగించినావు
కృపా క్షేమముతో నడిపించినావు (2)
నా కోసం భువికొచ్చిన దైవ మానవా
నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)      ||ఎన్నో||

English Lyrics

Audio

HOME