నాదు జీవమాయనే

పాట రచయిత: ఎం ఎస్ శాంతవర్ధన్
Lyricist: M S Shanthavardhan

Telugu Lyrics


నాదు జీవమాయనే నా సమస్తము
నా సర్వస్వమేసుకే నాదు జీవము
నాదు దైవము – దివి దివ్య తేజము (2)           ||నాదు||

కృంగిన వేళ – భంగపడిన వేళ – నా దరికి చేరెను
చుక్కాని లేని – నావ వలె నేనుండ – అద్దరికి చేర్చెను
ఆత్మతో నింపెను – ఆలోచన చెప్పెను (2)             ||నాదు||

సాతాను బంధీనై – కుములుచున్న వేళ – విడిపించెను శ్రీ యేసుడు
రక్తమంత కార్చి – ప్రాణాన్ని బలిచేసి – విమోచన దయచేసెను
సాతానుని అణగద్రొక్కన్ – అధికారం బలమిచ్చెను (2)          ||నాదు||

కారు మేఘాలెన్నో – క్రమ్మిన వేళ – నీతిసుర్యుడు నడుపును
తూఫానులెన్నో – చెలరేగి లేచిననూ – నడుపును నా జీవిత నావ
త్వరలో ప్రభు దిగివచ్చును – తరలి పోదును ప్రభునితో (2)         ||నాదు||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

ఇదిగో దేవా నా జీవితం

పాట రచయిత: వై బాబ్జి
Lyricist: Y Babji

Telugu Lyrics

ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం (2)
శరణం నీ చరణం (4)                       ||ఇదిగో||

పలుమార్లు వైదొలగినాను
పరలోక దర్శనమునుండి
విలువైన నీ దివ్య పిలుపుకు
నే తగినట్లు జీవించనైతి (2)
అయినా నీ ప్రేమతో
నన్ను దరిచేర్చినావు
అందుకే గైకొనుము దేవా
ఈ నా శేష జీవితం        ||ఇదిగో||

నీ పాదముల చెంత చేరి
నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి
ప్రార్థించి పనిచేయనిమ్ము (2)
ఆగిపోక సాగిపోవు
ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నన్నుండనిమ్ము      ||ఇదిగో||

విస్తార పంట పొలము నుండి
కష్టించి పని చేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు
కలకాలం మరి నాకు నొసగు (2)
క్షేమ క్షామ కాలమైనా
నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
నశియించే ఆత్మలన్
నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా         ||ఇదిగో||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME