పాట రచయిత:
Lyricist:
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
పైనున్న ఆకాశమందునా
క్రిందున్న భూలోకమందునా (2)
లేదు రక్షణ ఏ నామమున
లేదు పాప విమోచన – (2) ||పైనున్న||
అన్ని నామములకు పైని కలదు
ఉన్నతంబగు యేసుని నామము (2)
యేసు నామములో శక్తి కలదు (2)
దోషులకు శాశ్వత ముక్తి కలదు (2) ||పైనున్న||
అలసి సొలసిన వారికి విశ్రం
జీవము లేని వారికి జీవము (2)
నాశనమునకు జోగేడి వారికి (2)
యేసు నామమే రక్షణ మార్గము (2) ||పైనున్న||
యేసు నామము స్మరియించగానే
మనసు మారి నూతనమగును (2)
బేధమేమియు లేదెవ్వరికిని (2)
నాథుని స్మరియించి తరింప (2) ||పైనున్న||