నిను పోలి నేను

పాట రచయిత: ఆనీ మార్గరెట్
Lyricist: Annie Margaret

Telugu Lyrics

చీకటిలో నుండి వెలుగునకు
నన్ను నడిపిన దేవా (2)
నా జీవితానిని వెలిగించిన
నా బ్రతుకును తేటపరిచిన (2)

నన్ను నీవు రక్షించితివయ్యా
నీ కృప చేత నే బ్రతికితినయ్యా
నన్ను నీవు కాపాడితివయ్యా
నీ దయతో నన్ను దీవించితివయ్యా
యేసయ్యా నా యేసయ్యా
నీవే నా బలము యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా
నీవే నా సర్వము యేసయ్యా

నిను పోలి నేను జీవింతునయ్యా
నీ ఆత్మ దయచేయుమా
నిను పోలి నేను నడతునయ్యా
నీ కాపుదలనీయుమా

కనికరమే లేని ఈ లోకంలో
కన్నీటితో నేనుంటినయ్యా (2)
నీ ప్రేమతో నను ఆదరించిన
నా హృదయము తృప్తిపరచిన (2)         ||నన్ను నీవు||

నిను పోలి నేను జీవింతునయ్యా
నీ ఆత్మ దయచేయుమా
నిను పోలి నేను నడతునయ్యా
నీ కాపుదలనీయుమా (2)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

గడిచిన కాలమంతా

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics

గడిచిన కాలమంతా – నను నడిపిన నా దేవా
నీ కంటి పాప లాగా – కాపాడిన నా ప్రభువా (2)
మరో యేడు నాకొసగినందుకు – నీకేమి నే చెల్లింతును
నీ ప్రేమను పంచినందుకు – నిన్నేమని కీర్తింతును (2)        ||గడిచిన||

ఇచ్చిన వాగ్ధానం మరువక – నిలుపు దేవుడవు
శూన్యమందైనా సకలం – సాధ్యపరచెదవు (2)
నా మేలు కోరి నీ ప్రేమతో – నను దండించితివి
చెలరేగుతున్న డంభమును – నిర్మూలపరచితివి (2)        ||మరో యేడు||

నాదు కష్ట కాలములోన – కంట నీరు రాకుండా
నాదు ఇరుకు దారుల్లోన – నేను అలసిపోకుండా (2)
నా సిలువ భారం తగ్గించి – నీవేగా మోసితివి
నీ ప్రేమతో పోషించి – సత్తువ నింపితివి (2)        ||మరో యేడు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME