యేసయ్యా నాకంటూ

పాట రచయిత: డేవిడ్ సిండో
అనువదించినది: భరత్
Lyricist: David Sindo
Translator: Bharath

Telugu Lyrics


యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా (2)
నిన్ను నమ్మి నే బ్రతుకుచుంటిని
నిన్ను వెదకుచూ పరుగెత్తుచుంటిని
చూడు యేసయ్యా – నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా (2)       ||యేసయ్యా||

కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని
బయట చెప్పుకోలేక మనసునేడ్చితి (2)
లేరు ఎవరు వినుటకు
రారు ఎవరు కనుటకు (2)          ||చూడు యేసయ్యా||

లోకమంత వెలివేయగ కుమిలిపోతిని
నమ్మినవారు నను వీడగ భారమాయెను (2)
లేరు ఎవరు వినుటకు
రారు ఎవరు కనుటకు (2)          ||చూడు యేసయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

చిన్న గొర్రెపిల్లను నేను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

చిన్న గొర్రెపిల్లను నేను యేసయ్యా
మెల్లమెల్లగా నడుపు యేసయ్యా (2)

యేసయ్యా యేసయ్యా యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

శాంతి జలములందు పచ్చ గడ్డిలో
కాంతి బాటలో నడుపు యేసయ్యా (2)       ||యేసయ్యా||

ఒక్కటే ఆశ కలదు యేసయ్యా
చక్కనైన నీ ఇల్లు చేరేద (2)       ||యేసయ్యా||

శత్రువైన సాతాను ఎదుటను
విందు చేసినావు నాకు యేసయ్యా (2)       ||యేసయ్యా||

అంధకార లోయలో అండగా
ఉండుగాక నీ సిలువ యేసయ్యా (2)       ||యేసయ్యా||

English Lyrics

Audio

నీ చేతితో నన్ను పట్టుకో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నీ చేతితో నన్ను పట్టుకో
నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పి చేతిలో శిలను నేను
అనుక్షణము నన్ను చెక్కుము (2)

అంధకార లోయలోన
సంచరించినా భయములేదు
నీ వాక్యం శక్తిగలది
నా త్రోవకు నిత్యవెలుగు (2)

ఘోరపాపిని నేను తండ్రి
పాప ఊభిలో పడియుంటిని
లేవనెత్తుము శుద్దిచేయుము
పొందనిమ్ము నీదు ప్రేమను (2)

ఈ భువిలో రాజు నీవే
నా హృదిలో శాంతి నీవే
కుమ్మరించుము నీదు ఆత్మను
జీవితాంతము సేవ చేసెదన్ (2)    ||నీ చేతితో||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

 

 

HOME