వినరే యో నరులారా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


వినరే యో నరులారా – వీనుల కింపు మీర
మనల రక్షింప క్రీస్తు – మానుజావతారుడయ్యె – వినరే
అనుదినమును దే-వుని తనయుని పద
వనజంబులు మన-మున నిడికొనుచును     ||వినరే||

నర రూపు బూని ఘోర – నరకుల రారమ్మని
దురితము బాపు దొడ్డ – దొరయౌ మరియా వరపుత్రుడు
కర మరు దగు క-ల్వరి గిరి దరి కరి
గి రయంబున ప్రభు – కరుణను గనరే     ||వినరే||

ఆనందమైన మోక్ష-మందరి కియ్య దీక్ష
బూని తన మేని సిలువ – మ్రాను నణచి మృతి బొందెను
దీన దయా పరు-డైన మహాత్ముడు
జానుగ యాగము – సలిపిన తెరంగిది     ||వినరే||

ఇల మాయావాదుల మాని – యితడే సద్గురు డని
తలపోసి చూచి మతి ని-శ్చల భక్తిని గొలిచిన వారికి
నిల జనులకు గలు-ములనలరెడు ధని
కుల కందని సుఖ-ములు మరి యొసఁగును     ||వినరే||

దురితము లణప వచ్చి – మరణమై తిరిగి లేచి
నిరత మోక్షానంద సుం-దర మందిరమున కరుదుగ జనె
బిరబిర మన మం-దర మా కరుణా
శరనిధి చరణ మె – శరణని పోదము     ||వినరే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఈ జీవితం విలువైనది

పాట రచయిత: సత్యవేద సాగర్
Lyricist: Satyaveda Sagar

Telugu Lyrics

ఈ జీవితం విలువైనది
నరులారా రండని సెలవైనది (2)
సిద్ధపడినావా చివరి యాత్రకు
యుగయుగాలు దేవునితో ఉండుటకు
నీవుండుటకు           ||ఈ జీవితం||

సంపాదన కోసమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2)
పోతున్నవారిని నువు చుచుటలేదా (2)
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2)    ||ఈ జీవితం||

మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు
కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2)
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2)
కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2)    ||ఈ జీవితం||

పాపులకు చోటు లేదు పరలోకమునందు
అందుకే మార్పుచెందు మరణానికి ముందు (2)
యేసు రక్తమే నీ పాపానికి మందు (2)
కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2)    ||ఈ జీవితం||

English Lyrics

Audio

HOME