నీవే నన్ను కోరుకున్నావు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నీవే నన్ను కోరుకున్నావు
నీవే నన్ను చేరుకున్నావు
నీవే నన్ను విడిపించావు
నీవే నన్ను విడువనన్నావు
ఎంత ప్రేమ యేసయ్యా
వింత ప్రేమ నీడయ్యా (2)      ||నీవే||

నీ అరచేతిలో నను చెక్కుకున్నావు
నీ కృపలో నన్ను ఎన్నుకున్నావు
నీ రాజ్యములో నను దాచి ఉంచావు
నీ నామములో నను రక్షించావు      ||ఎంత||

నీ వాక్యముతో నను శుద్ధి చేసావు
నీ రక్తముతో నను కడిగివేసావు
నీ వాగ్ధానముతో నన్ను స్థిరపరచావు
నీ ఆత్మతో నను నింపివేసావు      ||ఎంత||

English Lyrics

Audio

HOME