నిశిరాత్రి

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

Telugu Lyrics

నిశిరాత్రి సుడిగాలిలో చిక్కితిని
ఊపిరితో మిగిలెదనా ఉదయానికి
తడవు చేయక యేసు నను చేరుకో
నా ప్రక్కనే ఉండి నను పట్టుకో
భయముండగలదా నీవున్నచో
నీ కన్నులు నామీద నిలిచుండగా
నా చేయి నీ చేతిలో ఉండగా     ||నిశిరాత్రి||

ఈ చీకటి సమయం నిలిచెను నా ఈ పయనం
కనిపించక దారులు మొదలాయెను కలవరము
వీచే ఈ గాలులలో నే కొట్టుకుపోకుండా
తప్పించెదవని దేవా ఆశతో నే వేచితిని
నీవు గాక నాకిపుడు దిక్కెవ్వరు     ||నిశిరాత్రి||

నే చేసిన వాగ్ధానము లెన్నో ఉన్నాయి
నెరవేర్చు బాధ్యతలు ఇంకా మిగిలాయి
ఈ రేయి ఈ చోటే నేనాగి పోవలదు
రాతిరి గడిచేవరకు నీ చాటున నను దాచి
ఉదయమును చూపించుము నా కంటికి

అల్పము ఈ జీవితమని నేనెరిగితిని
కనురెప్పపాటున ఆవిరికాగలదు
అనుదినమిక నీ కృపనే నే కోరుచు
పయనింతును నా గురివైపు నిను ఆనుకుని
భయముండగలదా నీవున్నచో
నీ కన్నులు నామీద నిలిచుండగా
నా చేయి నీ చేతిలో ఉండగా

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME