కన్నుల నిండుగ

పాట రచయిత: అనిల్ వేముల
Lyricist: Anil Vemula

Telugu Lyrics

కన్నుల నిండుగ – క్రిస్మస్ పండుగ
గుండెల నిండుగ – ఆనందముండుగ (2)
పరమ పురినుండే – పరిశుద్ధ దేవుడు
పుడమిలో పుట్టెగా – పాపుల బ్రోవగ
మహిమలోనుండే – మహిమాత్ముండు
మనుజుడాయెగా – మరణము నొందగా
రండి చేరి కొలిచెదం – రారండి కలసి పాడుదాం
రండి యేసుననుసరించుదాం – పదండి ప్రభుని చూపించుదాం (2)

సర్వసృష్టిని మాటతో చేసిన – సార్వభౌముడా నీకు సముడెవ్వరయ్యా
లోకపాపమంతయూ మోయవచ్చిన – దైవమానవా నీకు స్థలమే లేదయ్యా (2)
చీకటినుండి వెలుగునకు – మరణమునుండి జీవముకు (2)
నడిపింప వచ్చిన నజరేయుని – దాటింప వచ్చిన దయామయుని
ప్రేమించి వచ్చిన ప్రేమామయుని – క్షమియించ వచ్చిన క్షమాపూర్ణుని      ||రండి||

విశ్వమంతయూ వ్యాపించియున్న – సర్వవ్యాపి నీవులేని చోటే లేదయ్యా
అంతరంగమంతయూ ఎరిగియున్న – సర్వజ్ఞాని నీకు సాటే లేరయ్యా (2)
దాస్యము నుండి స్వాతంత్ర్యమును – శాపము నుండి విడుదలను (2)
ప్రకటింప వచ్చిన పుణ్యాత్ముని – రక్షింప వచ్చిన రక్షకుని
శాంతిచేయ వచ్చిన శాంతమూర్తిని – విడిపింప వచ్చిన విమోచకుని      ||రండి||

ఊహకందని త్రియేకమైయున్న – అద్వితీయుడా నీవే ఆత్మరూపివయ్యా
నిన్న నేడు రేపు ఏకరీతిగున్న – నిత్యనివాసి నీకు అంతమే లేదయ్యా (2)
సంకెళ్ళనుండి సంబరానికి – ఉగ్రతనుండి ఉదాత్తతకు (2)
తప్పింప వచ్చిన త్యాగమూర్తిని – కనికరింప వచ్చిన కరుణశీలుని
కృపజూపవచ్చిన కృపాకరుని – దాపుచేరనిచ్చిన దాక్షిణ్యపూర్ణుని      ||రండి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నా యేసు రాజు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా యేసు రాజు
నాకై పుట్టిన రోజు (2)
క్రిస్మస్ పండుగా
హృదయం నిండుగా (2)
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2)       ||నా యేసు||

పరలోకమునే విడిచెను
పాపిని నను కరుణించెను
పశు పాకలో పుట్టెను
పశువుల తొట్టిలో వింతగా (2)     ||హ్యాపీ||

నమ్మిన వారికి నెమ్మది
ఇమ్ముగనిచ్చి బ్రోవఁగా
ప్రతి వారిని పిలిచెను
రక్షణ భాగ్యమునివ్వగా (2)     ||హ్యాపీ||

సంబరకరమైన క్రిస్మస్
ఆనందకరమైన క్రిస్మస్
ఆహ్లాదకరమైన క్రిస్మస్
సంతోషకరమైన క్రిస్మస్ (2)      ||నా యేసు||

English Lyrics

Audio

HOME