నిజమైన ద్రాక్షావ

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

నిజమైన ద్రాక్షావల్లి నీవే
నిత్యమైన సంతోషము నీలోనే (2)
శాశ్వతమైనది ఎంతో మధురమైనది
నాపైన నీకున్న ప్రేమ
ఎనలేని నీ ప్రేమ – (2)         ||నిజమైన||

అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో
జీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా (2)
శిధిలమై యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి
నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా (2)         ||నిజమైన||

నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో
అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా (2)
వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు
జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా (2)         ||నిజమైన||

షాలేము రాజా రమ్యమైన సీయోనుకే
నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో (2)
అలసి పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి
ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో (2)         ||నిజమైన||

English Lyrics

Audio

శ్రేష్టమైన నామం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


శ్రేష్టమైన నామం – శక్తి గలిగిన నామం
జుంటి తేనె ధారల కన్నా మధురమైన నామం
సాటిలేని నామం – స్వస్థపరచే నామం
అన్ని నామముల కన్నా నిత్యమైన నామం
యేసు నామం మధుర నామం
యేసు నామం సుమధుర నామం (2)          ||శ్రేష్టమైన||

త్రోవ చూపి సరియైన దారిలో నన్ను నడిపించే నామం
దుష్ట శక్తులు బంధకములు తొలగించే
తరములెన్నో మారినా మనుజులంతా మారినా (2)
మారని నామం మహిమ నామం
మరణము గెల్చిన శ్రీ యేసు నామం (2)          ||శ్రేష్టమైన||

జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం
కలవరము నను వెంటాడినను ధైర్యమునిచ్చె ప్రభు నామం
భారమెంతో ఉన్నను శాంతినొసగే దివ్య నామం (2)
మారని నామం మహిమ నామం
మరణము గెల్చిన శ్రీ యేసు నామం (2)           ||శ్రేష్టమైన||

English Lyrics

Audio

 

 

HOME