సహోదరులు ఐక్యత కలిగి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


అది తల మీద పోయబడి
అహరోను గడ్డము మీదుగా కారినా…

సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు – ఎంత మనోహరము
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు – ఎంత మనోహరము
అది తల మీద పోయబడి
అహరోను గడ్డము మీదుగా కారినా…
పరిమళము – పరిమళ తైలము – (2)     ||సహోదరులు||

సంఘ సహవాసములో సహోదరులు
మత్సరము ద్వేషము అసూయతో నిండి (2)
వాక్యమును విడచి ఐక్యత లోపించి
తొలగిపోయిరి… ప్రభు కృప నుండి
సహవాసము పరిహాసమాయెను – (2)     ||సహోదరులు||

సిలువ వేయబడిన యేసు రక్షణ మరచి
స్వస్థతలు దీవెనలు అద్భుతములు (2)
క్షయమైన వాటి కొరకు – అక్షయుడగు ప్రభును వదిలి
అపహసించిరి… సువార్త సేవను
పరిశుద్ధాత్ముడు పరిహాసమొందెను – (2)     ||సహోదరులు||

English Lyrics

Audio

మహోన్నతుడా

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


మహోన్నతుడా
నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతై యున్నది
మహోన్నతుడా
నీ కృపలో నేను నివసించుట (2)           ||మహోన్నతుడా||

మోడుబారిన జీవితాలను
చిగురింప జేయగలవు నీవు (2)
మారా అనుభవం మధురముగా
మార్చగలవు నీవు (2)             ||మహోన్నతుడా||

ఆకు వాడక ఆత్మ ఫలములు
ఆనందముతో ఫలియించినా (2)
జీవ జలముల ఊట అయిన
నీ ఓరన నను నాటితివా (2)      ||మహోన్నతుడా||

వాడబారని స్వాస్థ్యము నాకై
పరమందు దాచి యుంచితివా (2)
వాగ్ధాన ఫలము అనుభవింప
నీ కృపలో నన్ను పిలచితివా (2)  ||మహోన్నతుడా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME