నీవు తప్ప నాకు ఇలలో

పాట రచయిత: ఫిలిప్ ప్రకాష్
Lyricist: Phillip Prakash

నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా
నీ ప్రేమ కన్నా సాటి భువిపై ఏదీ లేదయ్యా
నువ్వంటూ లేకుంటే నే బ్రతుకలేనయ్యా
నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా
నీ ప్రేమ లేకుంటే ఈ జన్మ లేదయ్యా
గుండె నిండ నిండున్నావు ఓ నా యేసయ్యా      ||నీవు తప్ప||

కష్టాల చెరలో చిక్కుకున్న నన్ను
నీ ప్రేమ వరమే కురిపించినావు
ఈ లోకమంతా వెలివేస్తున్న
నీ ప్రేమ నాపై చూపించినావు
నీ అరచేతిలో నను దాచినావయ్యా
నా చేయి విడువక నను నడిపినావయ్యా
నా తోడై నా నీడై వెంటుంటే చాలయ్యా          ||నువ్వంటూ||

కన్నీటి అలలో మునిగిన నన్ను
నీ దివ్య కరమే అందించినావు
ఆ సిలువలోనే నీ ప్రాణమును
నను రక్షింప అర్పించినావు
నీ కృప నీడలో నను కాచినావయ్యా
ఒక క్షణము వీడక కాపాడినావయ్యా
నా శ్వాసై నా ధ్యాసై నువ్వుంటే చాలయ్యా          ||నువ్వంటూ||

Download Lyrics as: PPT

HOME