ఏమని నే పాడెదన్

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును
ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును (2)
నిన్ను ఏమని నే పాడెదన్ – ఎట్లు నిన్ను స్తుతియింతును

రక్తం కార్చిన రక్షకుడా – కనికర సంపన్నుడా (2)
కనికర సంపన్నుడా – అయ్యా కనికర సంపన్నుడా (2)

అభిషేకించి ఆదరించినా – ఆదరణ నాయకుడా (2)
ఆదరణ నాయకుడా – అయ్యా ఆదరణ నాయకుడా (2)

నీ పాదాల దరి చేరి – తనివి తీరా ముద్దాడెదన్ (2)
తనివి తీరా ముద్దాడెదన్ – అయ్యా తనివి తీరా ముద్దాడెదన్ (2)

నిన్ను విడచి వేరెవ్వరు – ఉత్తముడా నీవేనయ్యా (2)
ఉత్తముడా నీవేనయ్యా – అయ్యా ఉత్తముడా నీవేనయ్యా (2)

రాకడలో కొనిపోదువు – నీతో నేనుందును (2)
నీతో నేనుందును – అయ్యా నీతో నేనుందును (2)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ప్రేమా పూర్ణుడు

పాట రచయిత: జాన్ డేనియల్
Lyricist: John Daniel

Telugu Lyrics

ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు
నను ప్రేమించి ప్రాణమిచ్చెను (2)
నే పాడెదన్ – కొనియాడెదన్ (3)
నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4)      ||ప్రేమా||

లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ
గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2)
యేసుని ప్రేమ వెల యెంతో
ఇహమందైనా పరమందైనా (2)
వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ
కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ – (2)      ||ప్రేమా||

మరణముకంటె బలమైనది – పునరుత్ధాన ప్రేమ
మరణపు ముల్లును విరచినది – బలమైన ప్రేమ (2)
రక్తము కార్చి రక్షణ నిచ్చి
ప్రాణము పెట్టి పరముకు చేర్చే (2)
గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ
బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ – (2)      ||ప్రేమా||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

స్తుతి సింహాసనాసీనుడా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


స్తుతి సింహాసనాసీనుడా
నా ఆరాధనకు పాత్రుడా (2)
నీవేగా నా దైవము
యుగయుగాలు నే పాడెదన్ (2)     ||స్తుతి||

నా వేదనలో నా శోధనలో
లోకుల సాయం వ్యర్థమని తలచి (2)
నీ కోసమే – నీ కృప కోసమే (2)
నీ వెలుగులో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ ఆత్మతో నింపుమయ్యా (2)     ||స్తుతి||

నీ సేవలోనే తరియించాలని
నీ దరికి ఆత్మలను నడిపించాలని (2)
నీ కోసమే – నీ కృప కోసమే (2)
నీ సముఖములో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ శక్తితో నింపుమయ్యా (2)     ||స్తుతి||

నా ఆశయముతో నా కోరికతో
నా గురి నీవని పరుగిడుచుంటిని (2)
నీ కోసమే – నీ కృప కోసమే (2)
నీ వెలుగులో నిలిచానయ్యా
యేసయ్యా.. నీ మహిమతో నింపుమయ్యా (2)     ||స్తుతి||

English Lyrics

Audio

నా నోటన్ క్రొత్త పాట

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా నోటన్ క్రొత్త పాట
నా యేసు ఇచ్చెను (2)
ఆనందించెదను ఆయననే పాడెదన్
జీవిత కాలమంతా (2) హల్లెలూయా          ||నా నోటన్||

అంధకార పాపమంత నన్ను చుట్టగా
దేవుడే నా వెలుగై ఆదరించెను (2)        ||ఆనందించెదను||

దొంగ ఊభి నుండి నన్ను లేవనెత్తెను
రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసెను (2)        ||ఆనందించెదను||

నాకు తల్లిదండ్రి మరియు మిత్రుడాయెనే
నిందలోర్చి ఆయనను ప్రకటింతును (2)        ||ఆనందించెదను||

వ్యాధి బాధలందు నేను మొర్ర పెట్టగా
ఆలకించి బాధ నుండి నన్ను రక్షించెను (2)        ||ఆనందించెదను||

భువిలోని బాధలు నన్నేమి చేయును
పరలోక దీవెనకై వేచియున్నాను (2)        ||ఆనందించెదను||

English Lyrics

Audio

ఏ సమయమందైనా

పాట రచయిత: ఆకుమర్తి డేనియల్
Lyricist: Akumarthi Daniel

Telugu Lyrics

ఏ సమయమందైనా ఏ స్థలమందైనా
ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్ (2)
ఆరాధనా ఆరాధనా
నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
గొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధనా     ||ఏ సమయమందైనా||

చెరసాలలో నేను బంధీగా ఉన్నా
సింహాల బోనులో పడవేసినా
కరువు ఖడ్గము హింస ఏదైననూ
మరణ శాసనమే పొంచున్ననూ
యేసు నామమే ఆధారము కాదా
యేసు రక్తమే నా విజయము
పగలు ఎండలలో రాత్రి వెన్నెలలో
కునుకక కాపాడు యేసు దేవునికే     ||ఆరాధనా||

నా జీవనాధారం శ్రీ యేసుడే
నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే
తన చేతులతో నన్ను నిర్మించెగా
నా సృష్టికర్తను కొనియాడెదన్
యెహోవ రాఫా నను స్వస్థ పరిచెను
యెహోవ షమ్మా నాకు తోడుగా
యెహోవ నిస్సీ నా ధ్వజముగా
అల్ఫా ఒమేగా ఆది దేవునికే    ||ఆరాధనా||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME