దివ్య తార

పాట రచయిత: గుడేటి పురుషోత్తం బాబు
Lyricist: Gudeti Purushottham Babu

Telugu Lyrics


వి విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
అండ్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)

దివ్య తార దివ్య తార
దివి నుండి దిగి వచ్చిన తార (2)
వెలుగైన యేసయ్యను వేనోళ్ళ చాటినది (2)
పశుల పాక చేరినది క్రిస్మస్ తార (2)        ||దివ్య||

జన్మించె యేసు రాజు – పరవశించె పరలోకం (2)
మధురమైన పాటలతో మారుమ్రోగెను
క్రీస్తు జన్మమే పరమ మర్మమే
కారు చీకట్లో అరుణోదయమే (2)
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార (2)        ||దివ్య||

ప్రభు యేసు నామం – ప్రజా సంఖ్యలోనున్నది (2)
అవనిలో క్రీస్తు శకము అవతరించినది
క్రీస్తు జన్మమే మధురమాయెనే
శాంతి లేని జీవితాన కాంతి పుంజమే (2)
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార (2)        ||దివ్య||

పాపలోక జీవితం – పటాపంచలైనది (2)
నీతియై లోకంలో వికసించినది
క్రీస్తు జన్మమే ప్రేమామయమే
చీకటి హృదయాలలో వెలుగు తేజమే (2)
తార తార క్రిస్మస్ తార
తార తార దివ్య తార (2)        ||దివ్య||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

మా ఇంటి పేరు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మా ఇంటి పేరు పశువుల పాక
పక్కింటి పేరు ఒలీవల తోట (2)
ఎదురింటి పేరు కల్వరి కొండ
మా వాడ పేరు సీయోను కోట          ||మా ఇంటి పేరు||

మా తండ్రి యేసు పశువుల పాకలో
తనను తాను చూడు తగ్గించుకొనెను (2)
కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో (2)
మోకాళ్ల కన్నిళ్ల ప్రార్దించె చూడు          ||మా ఇంటి పేరు||

మా ఆత్మ దేవుడు కల్వరి కొండలో
సంపూర్ణ సమర్పణ చేసెను చూడు (2)
తగ్గింపు ప్రార్థన సమర్పణలో (2)
మార్గము సత్వము జీవము చూడు          ||మా ఇంటి పేరు||

English Lyrics

Audio

HOME