పాట రచయిత: సునీల్ ప్రేమ్ కుమార్
Lyricist: Sunil Prem Kumar
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
ఓ మానవా.. నీ పాపం మానవా
యేసయ్య చెంత చేరి
నీ బ్రతుకు మార్చవా (2)
పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము
పాపములోనే మరణించినచో తప్పదు నరకము (2) ||ఓ మానవా||
ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువు
ఎంత కాలము శాపములోనే కొట్టబడుదువు
ఎంత కాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు
ఎంత కాలము దుఃఖములోనే మునిగియుందువు
యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము
యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును (2) ||ఓ మానవా||
ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు
ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు
ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు
ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు
యెసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను
యెసయ్యే నిను రక్షించి పరమున చేర్చును (2) ||ఓ మానవా||