సుందరమైన దేహాలెన్నో

పాట రచయిత: జాన్ వెస్లీ
Lyricist: John Wesley

Telugu Lyrics


సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా?
అంబరమంటిన రాజులెందరో అలిసిపోలేదా?
కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా?
ధరణిలోన ధనికులెల్లరు దహనం కాలేదా?
ఏదీ శాశ్వతం కాదేది శాశ్వతం
తరచి చూడుము పరికించి చూడము (2)       ||సుందరమైన||

నెత్తుటి చారలను లిఖించిన రాజులెందరో
ఆ నెత్తురులోనే ప్రాణాలు విడిచిపోయారు
అధికార దాహంతో మదమెక్కిన వీరులు
సమాధి లోతుల్లోనే మూగబోయారు (2)
తపోబలము పొందిన ఋషులందరూ
మతాధికారులు మఠాధిపతులు
ఈ కాలగర్భంలోనే కలసిపోయారు
మరణ పిడికళ్లలో బందీలయ్యారు (2)
యేసులేని జీవితం వాడబారిన చరితం (2)
క్రీస్తు ఉన్న జీవితం భువిలో చరితార్ధం (2)       ||సుందరమైన||

ప్రాణం పోసిన దైవాన్ని కాదంటే
ఆ జీవితానికి పరమార్ధం ఉంటుందా?
పాప సంకెళ్ళలో బందీలైనవారికి
ఆ దివ్య మోక్షం చేరుకొనే భాగ్యం ఉంటుందా? (2)
శరీరాన్ని విడిచిన మనుష్యాత్మకు
మరో జీవితం లేదనుట భావ్యమా?
రక్తము కార్చిన యేసుని విస్మరించి
ఈ సృష్టిని పూజించుట మనిషికి న్యాయమా? (2)
యేసులేని జీవితం అంధకార భందురం (2)
క్రీస్తు ఉన్న జీవితం తేజోమయ మందిరం (2)       ||సుందరమైన||

English Lyrics

Audio

సందేహమేల

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సందేహమేల సంశయమదేల
ప్రభు యేసు గాయములను పరికించి చూడు
గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2)      ||సందేహమేల||

ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే
నీ పాప శిక్షను తానే – భరియించెనే (2)
ప్రవహించె రక్త ధార నీ కోసమే
కడు ఘోర హింసనొందె నీ కోసమే (2)      ||సందేహమేల||

ఎందాక యేసుని నీవు – ఎరగనందువు
ఎందాక హృదయము బయట – నిలవమందువు (2)
యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా
యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2)      ||సందేహమేల||

ఈ లోక భోగములను – వీడజాలవా
సాతాను బంధకమందు – సంతసింతువా (2)
యేసయ్య సహనముతోనే చెలగాటమా
ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా (2)      ||సందేహమేల||

లోకాన ఎవ్వరు నీకై – మరణించరు
నీ శిక్షలను భరియింప – సహియించరు (2)
నీ తల్లియైన గాని నిన్ను మరచునే
ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా (2)      ||సందేహమేల||

English Lyrics

Audio

HOME