పాట రచయిత: నాని
Lyricist: Nani
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
ప్రార్ధన కలిగిన జీవితం
పరిమళించును ప్రకాశించును
పై నుండి శక్తిని పొందుకొనును (2)
విడువక ప్రార్ధించిన శోధన జయింతుము
విసుగక ప్రార్ధించిన అద్భుతములు చూతుము (2)
ప్రార్ధనే మన ఆయుధం
ప్రార్ధనే మన ప్రాకారము (2) ||ప్రార్ధన||
విడువక ప్రార్ధించిన శక్తిని పొందెదము
విసుగక ప్రార్ధించిన ఆత్మలో ఆనందింతుము (2)
ప్రార్ధనే మన ఆయుధం
ప్రార్ధనే మన ఆధారము (2) ||ప్రార్ధన||
విడువక ప్రార్ధించిన దైవ చిత్తము గ్రహింతుము
విసుగక ప్రార్ధించిన దైవ దీవెనలు పొందుదుము (2)
ప్రార్ధనే మన ఆయుధం
ప్రార్ధనే మన ఆధారము (2) ||ప్రార్ధన||
English Lyrics
Audio
Download Lyrics as: PPT